YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఇలాంటివి వినాల్సి రావడం బాధాకరం

Highlights

  • ఆమె గురించి ఏవోవో అంటున్నారు
  • శ్రీదేవి మరణంపై ఆర్జీవీ తాజా ట్వీట్
  • దుబాయిలో...పార్థీవదేహం స్వాధీన పరిచే విధానం
  • శవ పరీక్ష నివేదిక, మరణ దృవీకరణ తరువాత..
ఇలాంటివి వినాల్సి రావడం బాధాకరం

‘‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది’’ అని వర్మ ట్వీట్ చేశాడు.శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించి మాట్లాడుకునే వారని కానీ, ఇప్పుడు ఏవోవే మాట్లాడుకుంటున్నారని అన్నాడు. ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఇంకేవో ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నాడు. శ్రీదేవి మరణంతో విషాదంలో కూరుకుపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరోమారు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండాగా అసలు దుబాయ్ విధి విధానాలను ఒక సారి పరిశీలిద్దాం..

దుబాయిలో...పార్థీవదేహం స్వాధీన పరిచే విధానం
శవ పరీక్ష నివేదిక, మరణ దృవీకరణ తరువాత....
దుబాయిలో ఓ వ్యక్తి మ‌రణం తరువాత జరగాల్సిన తంతును అక్కడ చట్టాల ప్రకారం... మరణ ధ్రువీకరణ పత్రం అరబిక్‌లో ఇస్తారు. 
【శ్రీదేవి మరణ దృవీకరణ పత్రం ఇచ్చారు】
 భారత్‌ కాన్సులేట్‌కు మాత్రం దానికి అనువాదం చేసిన ఆంగ్ల ప్రతిని ఇస్తారు.
【 అనువాద ప్రతి తయారైయింది 】
నిబంధనల మేరకు రాత్రి వేళల్లో అధికారులు స్వీకరించరు.
  అనువాద ప్రతి అందిన తరువాత... నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.
అనంతరం శ్రీదేవి సజీవంగా ఉన్నప్పుడు దుబాయి దేశం జారీ చేసిన  'సజీవ వీసా' ను అధికారికంగా రద్దు చేస్తారు.
 అనంతరం శ్రీదేవి పార్ధీవదేహం తీసుకెళ్ళే స్థానిక అంబులెన్స్, విమానాశ్రయంలో సిద్దంగా ఉన్న విమానం, పైలట్, ఇతర ప్రాయాణికుల వివరాలతో పాటు పార్థీవదేహం స్వీకరించే వ్యక్తి శ్రీదేవి తరఫున భవిష్యత్తులో జరిగే న్యోయ పరమైన అంశాలకు, శ్రీదేవి కుటుంబానికి ప్రభుత్వం, ఇతర ఇన్సూరెన్స్ వ్యవహారాలకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు దృవీకరణ పత్రం అటు దుబాయ్ ప్రాసిక్యూషన్ కు, భారతీయ దౌత్య అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
 ఈ ప్రాక్రియలో ఎవ్వరూ తప్పకూడదు. అనంతరం సదరు కుటుంబ సభ్యులకు పార్థీవదేహాన్ని అప్పగిస్తారు. అంతే కాకుండా ఆ దేశ సరిహద్దులు దాటే వరకు దుబాయి ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగుతుంది.
బోనీ కపూర్ నిందితుడు కాదు.. విచారణలో భాగంగానే ఆ దేశంలో ఉండాలని పోలీసులు పేర్కొన్నారు.
తాజా సంఘటనలో...
ఇప్పుడు శ్రీదేవి పార్థీవదేహం వారి బంధువులకు అప్పగించే  విషయంలో కూడా పైన పేర్కొన్న ప్రొసీజర్‌ జరుగుతుంది. మన అమర్ సింగ్ ఫోన్ చేశారనో... గబ్బర్ సింగ్ గన్ను పట్టుకున్నారనో... నిబంధనలు.. మారవు. సడలింపు ఉండదు. విధానం మాత్రమే ఉంటుంది....

Related Posts