YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీనియర్లును తప్పిస్తున్నారా.. తప్పుకుంటున్నారా

సీనియర్లును  తప్పిస్తున్నారా.. తప్పుకుంటున్నారా

భారతీయ జనతా పార్టీలో మరో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత రాజకీయాలకు దూరమవుతున్నారు. ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మంచి వాగ్దాటి, ప్రజలను ఆకట్టుకునే సుష్మా స్వరాజ్ తనంతట తానే ప్రత్యక్ష్య రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా లోక్ సభ స్పీకర్ గా ఉన్న సుమిత్రా మహాజన్ కూడా తాను పోటీ చేయడం లేదని ప్రకటించడం భారతీయ జనతా పార్టీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.సుమిత్ర మహాజన్ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత. రాష్ట్రీయ స్వయం సేవక్ తో మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు ఎనిమిది సార్లు పార్లమెంటు సభ్యురాలగా గెలిచారు. ఇండోర్ నుంచి ఆమె గెలిచి తన సత్తా చాటరు. మహారాష్ట్రలో జన్మించిన సుమిత్రా మహాజన్ 1965లో జయంత్ మహాజన్ ను వివాహం చేసుకోవడంతో మధ్యప్రదేశ్ కు షిఫ్ట్ అయ్యారు. ఇండోర్ కార్పొరేటర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సుమిత్రా మహాజన్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇండోర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎ‌ల్ బి చేసిన మహాజన్ న్యాయవాద వృత్తి కూడా చేశారు.సుమిత్రా మహాజన్ 1999 నుంచి 2002 వరకూ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి రేసులో కూడా సుమిత్రా మహాజన్ పేరు విన్పించింది. 2014 లో లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అలాంటి సుమిత్రా మహాజన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇండోర్ టిక్కెట్ ను ఇప్పటి వరకూ కేంద్ర నాయకత్వం ప్రకటించడకపోవడంపై ఆమె కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. తన లాంటి సీనియర్ నేత కూడా టిక్కెట్ కోసం వెయిట్ చేసే పరిస్థిితికి రావడం ఆమెను కలచి వేసిందంటున్నారు.అందుకే హుందాగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయమోనని స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ కూడా రాశారు. 30 ఏళ్లుగా సుమిత్రా మహాజన్ ఏనాడు టిక్కెట్ కోసం ఎదురు చూడలేదు. పార్టీయే పిలిచి టిక్కెట్ ఇచ్చింది. అయితే మరో వారం రోజుల్లో మహాజన్ కు 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్ల వయసు నిండిన వారిని పక్కన పెట్టాలని బీజేపీ నిబంధనలను తనకు తానే వర్తింప చేసుకున్నారు. అంతేకాకుండా మహాజన్ కు టిక్కెట్ రాకుండా బీజేపీ జాతీయ కార్యదర్వి కైలాశ్ విజయ్ అడ్డుపడుతుండటాన్ని కూడా ఆమె సీరియస్ గా తీసుకుంది. మొత్తం మీద బీజేపీలో మరో సీనియర్ నేత ఎన్నికలకు గుడ్ బై చెప్పటం గమనార్హం

Related Posts