YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మారోతున్నచంద్రబాబు స్వరం

మారోతున్నచంద్రబాబు స్వరం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పూర్తిగా మారిపోయారు. ఇప్పటి వరకూ నూరశాతం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చానని చెప్పుకున్న చంద్రబాబు స్వరం మారింది. సభలకు వస్తున్న జనాదరణో, మరి అంతర్గత సర్వేల సారాంశమో తెలియదు కాని చంద్రబాబు స్వరం మార్చారు. ఈసారి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది తానేనని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై ఎటువంటి అసంతృప్తులు ఉన్నా వదలేయాలని, పార్టీని, తనను చూడాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారు.తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలా మంది వరకూ టిక్కెట్లు కేటాయించింది. కేవలం 30 శాతం స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చింది. దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేసిన చంద్రబాబు అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై నెలకొన్న అసంతృప్తులను ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాలను కూడా ఈసారి పరిగణనలోకి తీసుకోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలంగా ఉండటంతో పెద్దగా తప్పించలేకపోయారు గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు విషయం అర్థమయిందని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కొంప ముంచేటట్లు ఉందని గ్రహించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుండటంతో చంద్రబాబు అభ్యర్థులను చూసి ఓటేయవద్దని చెబుతున్నారు. నిజానికి చంద్రబాబుపై ఏపీలో పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన సమర్థుడని ఇప్పటికీ అధికశాతం ప్రజలు నమ్ముతున్నారు. కానీ గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేసిన దందాలు ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికరంగా మారాయిఅందుకోసమే చంద్రబాబు తానే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో తననే అభ్యర్థిగా చూడాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు తనను ఒంటరిని చేసి అందరూ ఏకమయ్యారని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కేసీఆర్, జగన్, మోదీ ఒక్కటై ఆంధ్రప్రదేశ్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవంగా చెబుతున్నారు. జగన్ వస్తే రాజధాని అమరావతిని మార్చేస్తారని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకతను పోలింగ్ సమయానికి పోగొట్టేందుకు చంద్రబాబు కేసీఆర్ తరహాలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో 119 నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

Related Posts