YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ కు మళ్లీ భంగపాటే

కాంగ్రెస్ కు మళ్లీ భంగపాటే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల సమయానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ కు భంగపాటు తప్పేట్లు లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి గత ఎన్నికల్లో అసెంబ్లీలో కాలుమోపలేకపోయింది. అనేక స్థానాల్లో అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీనికి తోడు కాస్త పేరున్న నేతలు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగిలిన బలమైన నేతలు అనుకున్న వాళ్లు సయితం పసుపు పార్టీ కండువాను కప్పేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కొండ్రు మురళి, పనబాక లక్ష్మి వంటి నేతలు కాంగ్రెస్ ను వీడి వెళ్లడంతో మరింత బలహీనమయింది. నాయకత్వ లేమి కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోయింది.ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగింది. ఒంటరిగా బరిలోకి తన సత్తా చూపుతానన్న హస్తం పార్టీ ప్రచారరంలోనూ పూర్తిగా వెనకబడి పోయింది. రాహుల్ గాంధీ పర్యటనతో కొద్దిగానైనా ఆశలు చిగురిస్తాయనుకుంటే అది కూడా సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. కేవలం ప్రత్యేక హోదా ఇస్తామన్న ఒకే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుంది. కానీ ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? అన్నది ప్రశ్నార్థకమే.పేరుకు పెద్ద పెద్ద నేతలున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీలోనే ఇంకా ఉన్నారు. కానీ ఆయన ఏపీ రాజకీయాల గురించి పట్టించుకోవడం మానేశారు. తన సోదరుడు జనసేన పార్టీతో బరిలోకి దిగి ఉండటంతో చిరంజీవి కూడా ప్రచారానికి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవిని ప్రచారానికి పిలిచే సాహసం చేయలేకపోయింది. అలాగే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో ఉన్నా? లేనట్లుగానే ఉంది. ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ప్రచారంలో ఇప్పటి వరకూ ఎక్కడా కనపడలేదు.ఒక్క పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రమే ఒంటిచేత్తో పార్టీని నడిపిస్తున్నారు. కానీ ఆయనకు శక్తికి మించిన పని. ఇక రఘువీరారెడ్డి కూడా తన సొంత నియోజకవర్గంలో గెలుపుకోసం శ్రమిస్తున్నారు. రఘువీరారెడ్డి కల్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ కు ప్రచారం చేసే వారే కరువయ్యరాు. జాతీయ స్థాయి నేతలు కూడాఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎటూ రాని దాని కోసం పాకులాట ఎందుకనుకున్నారో? ఏమో ఇటు వైపు రావడమే మానేశారు. మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల సమాయానికి చేతులెత్తేసినట్లయింది.

Related Posts