సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పార్టీ నేతలు రాజ్ నాథ్ సింగ్.. సుష్మా స్వరాజ్.. అరుణ్ జైట్లీతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశలు.. ఆకాంక్షలు.. కోరికలకు పట్టం కట్టేలా తమ విజన్ డాక్యుమెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తనే తమ మేనిఫెస్టోను తయారు చేయలేదని.. దాని వెనుక ఎంతో కసరత్తు ఉందన్న విషయాన్ని రాజ్ నాథ్ తన మాటల్లో చెప్పారు. ఆరు కోట్ల ప్రజల అభిప్రాయాల్ని సేకరించి.. తమ దార్శనిక పత్రంలో పొందుపర్చినట్లుగా చెప్పిన ఆయన.. తమ ప్రభుత్వం అవినీతిని అణిచివేసినట్లు పేర్కొన్నారు.మేనిపెష్టోలో పేర్కొన్న అంశాలు చూస్తే.. % రైతులకు పెద్దపీట వేస్తూ.. కిసాన్ సమ్మన్ నిధి కింద రైతులకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయంతో పాటు.. 60ఏళ్లు నిండిన సన్న చిన్నకారు రైతులకు పింఛన్ పథకాన్ని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయింపు చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.% అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిరం మీద బీజేపీ తన విధానాన్ని వెల్లడిస్తూ.. అందరి ఆమోదంతోనే మందిర నిర్మాణం సాగుతుందన్నారు. రాజ్యాంగ విధివిధానాలకు లోబడి త్వరలోనే అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం చేపడతామన్నారు.% పలువురు వ్యతిరేకిస్తున్న.. అదే సమయంలో ఎక్కువమంది డిమాండ్ చేస్తున్న ఉమ్మడి పౌర స్మృతి.. పౌరసత్వ సవరణ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.% బీజేపీ మేనిఫెస్టో అన్నంతనే అందరూ ఆసక్తిగా చూసే రామ మందిరం.. ఉమ్మడి పౌర స్మృతిల మీద క్లారిటీ ఇచ్చిన బీజేపీ.. అందరికీ ఆరోగ్యమనే హామీని ఇచ్చింది. 2024 నాటికి ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం కింద ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదంటే పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 1.5లక్షల ఆరోగ్య కేంద్రాల్లో టెలీమెడిసిన్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. % మెట్రో నెట్వర్క్ కిందకు 50 నగరాలను తీసుకొస్తామని.. రహదారుల నిర్మాణంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు భారత్మాలా 2.0 ను స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రూ.50లక్షల వరకు రుణాలు ఇస్తామన్న హామీని ఇచ్చింది. % 2024 నాటికి 200 కొత్త కేంద్రియ విద్యాలయాలు నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తామని.. ఎంబీబీఎస్.. స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే టాప్ 500 విద్యాసంస్థల్లో భారత విద్యాసంస్థలకు చోటు దక్కేలా ప్రోత్సాహం అందిస్తామని పేర్కొంది. % మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పే లా అంగన్ వాడీ ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు చేస్తామన్న హామీతోపాటు.. పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. త్రిపుల్ తలాక్ నిఖా హలాలా బిల్లులు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.మరికొన్ని అంశాల్ని చూస్తే.. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు- ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు- సైనిక దళాల బలోపేతం కోసం అత్యుధునిక ఆయుధాల కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు- దేశవ్యాప్తంగా దశలవారీగా జాతీయ పౌరసత్వ నమోదు అమలు- ఈశాన్యంలో చొరబాట్లను అరికట్టేందుకు అధునాతన సాంకేతికత వినియోగం- ఆర్టికల్ 370 ఆర్టికల్ 35ఏ రద్దుకు చర్యలు