యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డితోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, కార్మికులకు కర్షకులకు న్యాయం జరుగుతుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి అరుణ్ కుమార్ అన్నారు నేషనల్ కమ్యునిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారణం సరస్వతి అద్యక్షతన గుంటూరు జిల్లా మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సభ జరిగింది.ఈ సమావేశానికి సాయి అరుణ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రము లో జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిస్తాత్మకమైనవని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న నవరత్నాలు రాష్ట్ర ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో గతంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా చాలా భిన్నంగా ఉంది. అందుకే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి. కాగా అన్ని రంగాల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం జగన్ తీసుకోనున్న నిర్ణయం హర్షణీయం. సొంత ఆటో లేదా టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, మరమ్మతులు తదితర అవసరాల కోసం సంవత్సరానికి రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆటో, టాక్సీ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అంతే కాకుండా వివిధ రంగాల్లో కార్మికులకు మంచి చేయూతనిస్తానని కార్మికులకు జగన్ భరోసా ఇవ్వడం శుభ పరిణామమన్నరు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో ఆటో, టాక్సీ కార్మికులు, వివిధ రంగాల్లో పని చేసే కార్మికులు ఆరోగ్యం పట్ల చాలా ధీమాగా ఉండేవారు. తరువాత ఆరోగ్య మరుగున పడిపోయింది. తరువాత జగన్ పాదయాత్రలో కార్మికులంతా ఆయన్ను కలిసి ఆరోగ్య పరిస్థితి, పన్నులు, వివిధ సమస్యల గురించి వివరించి వినతులు ఇవ్వగా, వాటిని విని వినతులు పరిశీలించిన జగన్ కార్మికులకు భరోసా కల్పించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి, ఆటో, టాక్సీ కార్మికులకు ఇన్సూరెన్స్ తదితర వాటిని వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామని అన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా పరిస్థితిని బట్టి వారందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు మేలు కలిగించే ఇన్ని రకాల హామీలు ఇచ్చిన జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన, మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు సాయి అరుణ్ కుమార్ పిలుపు నిచారు.అనంతరం ఎన్సిపి రాష్ట్ర కార్య దర్శి కృపా సత్యం మాట్లాడుతూ జగన్ నాయకత్వం లో ఏర్పడే కొత్త ప్రభుత్వం లో పేద,బడుగు,బలహీన వర్గాలకు న్యాయం జరుగగలదన్న విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ సమావేశం లో పార్టీ మహిళా అధ్యక్షురాలు పి.దానమ్మ,అధికార ప్రతినిధి మండా భూషణం తో పాటు అనెక్కమన్ది కార్య కర్తలు హాజరైనారు.