YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పెట్టుబడులకు అనువైంది 

Highlights

  • విశాఖలో ముగిసిన పెట్టుబడుల సదస్సు 
  • మూడు రోజు .. 734 ఒప్పందాలు 
  • పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు 
ఏపీ పెట్టుబడులకు అనువైంది 

పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడుల పురోగతి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచామని చెప్పారు. భావనపాడులో పోర్టుకు ఆదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదిరినట్టు చంద్రబాబు తెలిపారు. ఏపీని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తామని... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామన్నారు. ప్రతిసవాల్‌ను ఒక అవకాశంగా మల్చుకుంటూ అభివృద్ధివైపు పయనిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా  గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు సారథ్యంతో ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు.
విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసింది. ఈ సమ్మిట్‌లో మూడోరోజు పెట్టుబడి ఒప్పందాలు వెల్లువెత్తాయి. ఒక్క చివరి రోజే ఏపీ ప్రభుత్వం 369 భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. 
మూడు రోజులు. 4253 మంది ప్రతినిధులు. 734 భాగస్వామ్య ఒప్పందాలు. నాలుగు లక్షల 39వేల 765 కోట్ల పెట్టుబడులు. 11లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు. ఇవీ విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ సాధించిన పెట్టుబడులు. పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ తమ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. అందుకే ఈ సమ్మిట్‌ను వచ్చే ఏడాది కూడా తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల్లో మొత్తంగా 734 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. వీటితో ఏపీకి 4లక్షల 39వేల 765 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీలోని 11 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశం లభించనుంది.

Related Posts