Highlights
- రిలయన్స్, గెయిల్ షేర్లకు ఆదరణ
- స్టాక్ మార్కెట్ శుభారంభం
- .సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.81 వద్ద ట్రేడింగ్
పీఎన్‌బీ మోసం వివాదం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంబుజా సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.81 వద్ద ట్రేడవుతోంది. ప్రధాన సూచీలు లాభాల్లోనే నడుస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 149 పాయింట్లు లాభపడి 34594.96 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సూచీ కూడా 44.30 పాయింట్ల లాభంతో 10627 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, ఎస్ బ్యాంక్, గెయిల్, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ తదితర కంపెనీల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి.