YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అహంకారపూరితంగా ఉన్న భాజపా హామీ పత్రం.. భాజపా మేనిఫెస్టోపై రాహుల్‌ గాంధీ

అహంకారపూరితంగా ఉన్న భాజపా హామీ పత్రం..  భాజపా మేనిఫెస్టోపై రాహుల్‌ గాంధీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారతీయ జనతా పార్టీ హామీ పత్రం అహంకారపూరితంగా ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. భాజపా మేనిఫెస్టోపై స్పందిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం అందుకు భిన్నంగా, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందన్నారు.  బిజెపి మేనిఫెస్టో తలుపులు మూసేసిన ఒక గదిలో తయారైందని ఆయన అన్నారు.  ‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విస్తృత చర్చల ద్వారా రూపొందించాం. దాదాపు పది లక్షల మంది భారతీయుల గళమే మా మేనిఫెస్టో. అది తెలివితో రూపొందించిన ఒక శక్తిమంతమైన హామీ పత్రం’’ అని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అలాగే భాజపా మేనిఫెస్టోపై విమర్శలు కురిపించారు. హ్రస్వ దృష్టితో రూపకల్పన చేసిన బీజేపీ  మేనిఫెస్టో కేవలం ఒక ఒంటరి వ్యక్తి గళాన్ని మాత్రమే వినిపిస్తుంద ని అన్నారు.  లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భాజపా సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘సంకల్ప్ పత్ర’ పేరిట రూపొందించిన ఈ హామీ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసారు.  ఇప్పటికే ప్రకటించిన పీఎం కిసాన్‌ పథకంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అమలు, రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు లాంటి పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో పార్టీ చేర్చింది. 

Related Posts