యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ గెలుపు కోసం మోడీ, కేసీఆర్ పని చేస్తున్నారు. ఐదేళ్ల క్రితమే ప్రత్యేక హోదాకు సహకరించమని అడిగితే.. టీఆర్ఎస్ సహకరించ లేదు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అయన మీడియతో మాట్లాడారు. దొంగలు, కుంభకోణాలు చేసిన వ్యక్తులు ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్నారు. 97 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు, 12 మంది ఎంపీ అభ్యర్ధులపై కేసులున్నాయి. గత ఎన్నికల్లో ఆలోచనతో వేసిన ఓటు అభివృద్ధికి కారణమైంది. మళ్లీ అదే విఙతతో ఈసారి కూడా ఓటేయాల్సిన అవసరం ఉందని అయన అన్నారు. కుక్క పిల్లను పెంచుకోవాలంటే దాని లక్షణాలు చూస్తాం.. అలాంటిది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసేటప్పుడు ఆలోచన చేయాల్సి ఉంది. లక్షలాది మంది షేర్ హోల్డర్లను మోసం చేశారంటూ పీవీపీ వ్యాపార కార్యకలాపాలను సెబీ నిలిపేసింది. వ్యాపారం చేయడానికి పనికి రారని పీవీపీని అమెరికన్ బ్యాంకులే తప్పు పట్టాయి. వైసీపీ అధినేత మీదే 31 కేసులున్నాయి. జగన్, పీవీపీ వంటి వారు రాష్ట్రానికే అప్రతిష్ట. మోడీకి ఎదురు తిరిగిన వ్యక్తి చంద్రబాబు. ప్రధాని అయ్యే అర్హత చంద్రబాబుకు ఉందని దేవెగౌడ అనడం ఆయన విశ్వసనీయతకు నిదర్శనమని అయన అన్నారు.