YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్రంలో మరోసారి కమలం

కేంద్రంలో మరోసారి కమలం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్‌సభ ఎన్నికల తొలి విడతకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కమలనాథులకు కాస్త జోష్ ఇచ్చే ఫలితాలు ఇచ్చింది ఒపీనియన్ పోల్. మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్ సారాంశం ఒక్కటే. అది మళ్లీ బీజేపీదే అధికారం అని. అయితే 2014 ఎన్నికల్లోలాగా సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ మాత్రం రాదని తేలిపోయింది. మిత్రుల సాయంతో కలిసి బొటాబొటి మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నట్లు ఈ ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇక తెలంగాణలో టీఆరెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను టీఆరెస్ 14 గెలిచే అవకాశం ఉన్నట్లు ఒపీనియన్ పోల్ తేల్చింది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో గెలవగా.. ఈసారి 228 స్థానాలకు పరిమితం కానుంది. మొత్తంగా నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) 274 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పోల్ అంచనా వేసింది. ఇక రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గత ఎన్నికల కంటే రెట్టింపు స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నా.. బీజేపీని వెనక్కి నెట్టి అధికారం చేపట్టే చాన్స్ అయితే లేదని తేలిపోయింది. కాంగ్రెస్‌కు ఈసారి 88 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో కలిపినా 140 మార్క్ దగ్గరే యూపీఏ ఆగిపోనుంది. ఇక దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు 129 స్థానాల్లో గెలవనున్నట్లు అంచనా ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గురువారం మొదలు కానున్న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఏడు విడతల్లో ముగియనుంది. మే 23న ఫలితాల వెల్లడి కానున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి.. బీజేపీ సీట్లకు భారీ గండి కొట్టే అవకాశం ఉన్నట్లు ఈ పోల్‌లో తేలింది. 2014 ఎన్నికల్లో యూపీలో 71 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈసారి 40కే పరిమితం కానుంది. బీహార్‌లో మాత్రం బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ఫలితాలు రావచ్చు. ఇక్కడ మొత్తం 40 సీట్లకుగాను 31 బీజేపీ, జేడీయూ కూటమికి రానుండగా.. 9 సీట్లు కాంగ్రెస్, ఆర్జేడీ సొంతం చేసుకోనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ స్వీప్ చేయనున్నట్లు పోల్ స్పష్టం చేసింది. మొత్తం 25 స్థానాలకు గాను 21 వైసీపీ సొంతం కానున్నాయి. టీడీపీ కేవలం నాలిగింటితో సరిపెట్టుకోనుంది

Related Posts