YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

డ్రీమ్ 11 కు ఆరుకోట్ల మంది యూజర్లు

డ్రీమ్ 11 కు ఆరుకోట్ల మంది యూజర్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కొత్త కంపెనీ. దాని పేరు కూడా చాలా మందికి తెలియదు. అయితేనేం సత్తా చాటింది. తానేంటో నిరూపించుకుంది. అందరి చూపును ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఆ కొత్త కంపెనీ పేరు డ్రీమ్11. ఇదొక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ. యూనికార్న్ క్లబ్‌లో చేరిపోయింది. 1 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్స్‌ను యూనికార్న్స్‌గా పేర్కొంటాం. డ్రీమ్11 ఫ్యాంటసీ కంపెనీ వ్యాల్యుయేషన్ 1.5 బిలియన్ డాలర్లలోపు ఉండొచ్చు. హాంగ్‌కాంగ్‌కు చెందిన స్టీడ్‌వ్యూ క్యాపిటల్ అనే సంస్థ డ్రీమ్11 కంపెనీలో వాటా కొనుగోలు చేసింది. దీంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లపైకి చేరింది. కాగా చైనాకు చెందిన టెన్‌సెంట్ కంపెనీ ఏడు నెలల క్రితం డ్రీమ్11లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు కంపెనీ విలువ 700 మిలియన్ డాలర్లుగా ఉంది. కలారి క్యాపిటల్, మల్టీపుల్స్ అల్‌టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్, థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థలు తమ వాటాలను స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌కు విక్రయించాయని డ్రీమ్11 తెలిపింది. కాగా డ్రీమ్11కు 6 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

Related Posts