Highlights
- మూవీ టైటిల్ 'ఆఫీసర్'?
- ముంబైలో షూటింగ్
- త్వరలోనే టైటిల్ ప్రకటన..?
మరోసారి ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'శివ'ను మించి ఉంటుందని వర్మ ముందు నుంచి ఊరిస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి వర్మ ఎలాంటి టైటిల్ పెడతారోననే విషయంలో ఆందరిలోను ఆసక్తి వుంది. నాగార్జున ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
అందువలన కథ ప్రకారం ఈ సినిమాకి 'ఆఫీసర్' అనే టైటిల్ ను వర్మ ఖరారు చేశాడనేది తాజా సమాచారం. ఈ సినిమాతో తెలుగు తెరకి 'మైరా సరీన్' కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ఎనౌన్స్ చేసే ఆలోచనలో వున్నారు కాగా వర్మ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది.