YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

9వేల కిలోల బంగారం వేలం వేసిన ప్రభుత్వం

9వేల కిలోల బంగారం వేలం వేసిన ప్రభుత్వం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వం 9,000 కిలోల బంగారాన్ని వేలం వేసింది. ఇటీవల ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు ధ్రువీకరించారు. గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంలో భాగంగా ప్రభుత్వం మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ల కింద సేకరించిన బంగరాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీంతో వ్యవస్థలోకి నగదు ప్రవాహం కూడా పెరిగింది. ప్రభుత్వం గోల్డ్‌మానిటైజేషన్‌ స్కీం కింద మొత్తం ఫిబ్రవరి 20నాటికి 15,650 కిలోల బంగారాన్ని సేకరించింది. వీటిల్లో 6,584 కిలోల బంగారం  స్వల్పశ్రేణి బాండ్ల కింద, 2,938 కిలోల బంగారం మధ్యశ్రేణి కింద, 6,128 కిలోల బంగారం దీర్ఘశ్రేణి బాండ్ల కింద సమీకరించింది. ఈ స్కీం కింద ప్రభుత్వం 2.5 శాతం వడ్డీరేటును చెల్లించడంతో పాటు చివర్లో బంగారం మొత్తానికి సమానమైన  నగదును ఇస్తుంది. ప్రజల వద్ద నిరుపయోగంగా పడిఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తెచ్చేందుకు ఈ స్కీంను ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద 1-3ఏళ్ల వ్యవధిని స్వల్పకాలికంగా, 5-7ఏళ్ల వ్యవధిని మధ్యకాలికంగా, 12-15ఏళ్ల వ్యవధిని దీర్ఘకాలికంగా పరిగణిస్తారు.ఈ క్రమంలో భాగంగా మధ్య, దీర్ఘశ్రేణి డిపాజిట్ల కింద సేకరించిన బంగారాన్ని విక్రయించారు. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ 9,000 కిలోల బంగారం వేలం పూర్తి చేసింది.

Related Posts