YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ గారు... 2014లో ఏమైందో ఓసారి గుర్తు చేసుకోండి రాబోయేది జనసేన ప్రభుత్వమే

కేసీఆర్ గారు... 2014లో ఏమైందో ఓసారి గుర్తు చేసుకోండి రాబోయేది జనసేన ప్రభుత్వమే
ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి అన్ని కులాలు, మతాలు, సంస్కృతులను గౌరవించాలని, చెప్పులతో కొండెక్కి తిరుమలను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డిలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రికి జగన్ చెప్పులు వేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా.? అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో నిజాయతీ ఉంది. కేసీఆర్ గెలవడం, ముఖ్యమంత్రి అవ్వడం ధర్మం.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అండగా ఉండటం అధర్మం. దీనిని యాదాద్రి నర్సింహస్వామి, చండిదేవీ కూడా ఒప్పుకోరు. ఆంధ్రులను పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే ఆంధ్రులు ఓట్లు వేసేస్తారా..? అని అన్నారు. 2014లో జగన్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారని కేసీఆర్  చెప్పారు. అప్పుడు ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. అప్పటికీ, ఇప్పటికీ వైసీపీ ఏ మాత్రం బలపడలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కాదు, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని అన్నారు.  జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన,  భీమవరంలో రాష్ట్ర ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఈ వీడియోలో  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీకి చెందిన కొంత మంది నాయకులు నా సంస్కారాన్ని బలహీనత అనుకుంటున్నారు. నన్ను ద్వేషించే శత్రువు ఇంటికి వచ్చినా ఆతిధ్యం ఇచ్చి పంపిస్తానని అన్నారు. 
వైసీపీ నేత అంబటి రాంబాబు, టీడీపీ నేత తోట త్రిమూర్తులు, చంద్రబాబు  అంటే పడి చచ్చిపోయే చలమలశెట్టి సునీల్, గానీ, నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడాను. దీనిని అడ్డంపెట్టుకుని పవన్ కళ్యాణ్ మాకు బాగా తెలుసు, మా ఇంట్లో పెళ్లికి కూడా వచ్చాడు. నేను రావొద్దని చెప్పాను కనుకే సత్తెనపల్లికి ప్రచారానికి రాలేదని అంబటి ప్రచారం చేసుకోవడం ఆయన స్థాయికి తగదు. మీరు మీ ఇంట్లో పెళ్లికి పిలిస్తే.. నేను వచ్చి మీ కుటుంబానికి గౌరవం ఇస్తే.. మీరు మాత్రం నన్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. సత్తెనపల్లిలో ప్రచారం చేయకపోవడానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలే తప్ప, వేరొకటి కాదు. అంబటి రాంబాబు కి ఒకటే చెబుతున్నాను మీరు సత్తెనపల్లిలో ఓడిపోతున్నారు. అక్కడ గెలవబోయేది జనసేన పార్టీయే గుర్తుపెట్టుకోండి.  టీడీపీ నేత తోట త్రిమూర్తులు తో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి పరిచయం ఉంది. ఈ మధ్య నన్ను కలిసి పార్టీని బాగా తీసుకెళ్తున్నారు, బాగా మాట్లాడుతున్నారని మెచ్చుకున్నారు. ఆయన్ను నేను ఎప్పుడు పార్టీలోకి రావాలని ఆహ్వానించలేదు. ఆయన పరిచయం చేసిన వ్యక్తులు కూడా పార్టీలోకి రాలేదని అయన అన్నారు.

Related Posts