YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా ఇచ్చిన వారికి మద్దతు

హోదా ఇచ్చిన వారికి మద్దతు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి రైతు ఆవేదన చూశాను. ప్రతి పేదవాడు, దిగువ మధ్య తరగతి వారి బాధలు, కష్టాలు చూశాను.   వారి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాం.  ఈ 5 ఏళ్ల దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు చివరి ఘడియలు వచ్చాయి. మరో 36 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయని వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు లో జరిగిన బహిరంగసభలో అయన ప్రసంగించారు.  ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మోసాలు, కుట్రలు చూశారు. చివరి ఘడియలు వచ్చేసరికి చంద్రబాబు ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు.  గ్రామాలకు మూటల డబ్బు పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెట్టి కొనే ప్రయత్నం చేస్తారు.  అందుకే ప్రతి ఊరు, వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి, చంద్రబాబు మోసాలు వివరించాలని అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే నవరత్నాలు పథకాలు మాత్రమే కాకుండా, పాదయాత్రలో దృష్టికి వచ్చిన అనేక అంశాలతో మేనిఫెస్టో ప్రకటించాం.  ప్రతి పథకాన్ని పూర్తి పారదర్శకంగా నేరుగా అందిస్తాను.  ఎన్నికల్లో లబ్ది కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారని విమర్శించారు.  వైయస్సార్సీపీ మొదలైన నాటి నుంచి జగన్ అనే వ్యక్తి ఒంటరిగానే వచ్చాడు. ప్రజలు, దేవుణ్ని మాత్రమే నమ్మాడు తప్ప, వేరెవ్వరినీ కాదు. 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు.  ఇవాళ మనం అధికారంలోకి వస్తున్నాం. మరోవైపు మోదీ గ్లామర్ తగ్గింది. అలాంటి పరిస్థితిలో నేను మోదీతో పొత్తు పెట్టుకుంటానా? చెప్పండి.  రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. కల్మశం ఉండకూడదు.   ఇవాళ మన యువత ఉపాధి కోసం వలస పోతున్నారు.  వారికి మంచి, న్యాయం జరగాలంటే, హోదా వల్లనే సాధ్యం.  ఇవాళ కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. ఎవరైనా ప్రధాని కావొచ్చు, మాకెలాంటి అభ్యంతరం లేదు.  హోదాకు ఎవరు సంతకం పెడితే, వారికే మద్దతు ఇస్తామని అయన అన్నారు.  నేను ఎప్పుడూ, ఎవరినీ మోసం చేయలేదు. ఆ అలవాటు నాకు లేదు.  కాబట్టి నిజాయితీకి ఓటు వేయాలని కోరుతున్నానని అన్నారు.

Related Posts