Highlights
- మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ
- ఫుట్ బాల్ మ్యాచ్ ల వీక్షణకు అనుమతి
- మహిళలు ఆర్మీలోకి అనుమతి
- మార్చి 1 దరఖాస్తుకు చివరి గడువు
సౌదీ అరేబియా గతకొంత కాలంగా చేపట్టిన సంస్కరణల్లో భాగంగా మహిళా స్వేచ్ఛ కల్పించింది. మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ చారిత్రక ప్రకటన చేసింది. గత జూన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన రాజు, అదే విధంగా ఫుట్ బాల్ మ్యాచ్ లను తిలకించేందుకు వాసుబాటు కల్పించారు.ఇప్పుడు ఆర్మీలో చేరొచ్చంటూ నిబంధన విధించారు. అంతేకాకుండా రియాద్, మక్కా, అల్-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్స్ లలోని మహిళలు సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని సౌదీ రాజు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మార్చి 1 (గురువారం) అని సౌదీఅరేబియా ప్రకటించింది. సౌదీఅరేబియాలో మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్మీలో చేరాలనుకునే ఔత్సాహిక మహిళలు 12 కనీస అర్హతలు కలిగి ఉండాలని సూచించారు. వాటిలో కొన్నింటి వివరాల్లోకి వెళ్తే...1) సౌదీ జాతీయురాలై ఉండాలి.
2) 25-35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.
3) హైస్కూలు విద్య పూర్తి చేసి ఉండాలి.
4) వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరి.
5) హైట్ 155 సెంటీమీటర్లకు తగ్గకూడదు.
6) గార్డియన్ అనుమతితోనే సైన్యంలో చేరాలి, తదితర నిబంధనలున్నాయి.
గార్డియన్ అనుమతి తప్పనిసరి అన్న నిబంధనపై మానవహక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి.