YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మేనిఫెస్టోలో దేశ భద్రత: చిదంబరం

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మేనిఫెస్టోలో దేశ భద్రత: చిదంబరం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మేనిఫెస్టోలో దేశ భద్రత అనే అంశాన్ని చేర్చి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక అధికారాలకు సంబంధించిన నిబంధనలు 370, 35ఏను సవరించడం..ఆ రాష్ట్రంలో పెద్ద విపత్తుకు బీజం వేసినట్లేనని పరోక్షంగా భాజపా హామీని దుయ్యబట్టారు. దీనిని బట్టి అధికార భాజపా శాంతి కంటే యుద్ధాన్నే కోరుకుంటోందన్నది అర్దమవుతున్దన్నారు.. మేనిఫెస్టోలో నోట్ల రద్దు, రెండు కోట్ల ఉద్యోగాలు లాంటి పలు అంశాలను భాజపా ప్రస్తావించలేదన్నారు. ఇదే వారి వైఫల్యాలకు నిదర్శనమన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుకోవడానికే దేశ భద్రత అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. పదేళ్ల యూపీఏ హయాంలో ఏనాడు దేశంలో యుద్ధ భయం అలుముకోలేదన్నారు. భాజపా హయాంలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌ ప్రజలు, మిత్రపక్షాల ఆకాంక్షల మేరకే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్ట సవరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చామని వివరించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ హామీ ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న అత్యాచారాలు, హింసను అరికట్టడం భాజపాకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. భాజపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీఎం కిసాన్‌ పథకం ద్వారా దాదాపు 2/3వ వంతు రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చిదంబరం అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రవేశపెట్టనున్న కనీస ఆదాయ పథకం ద్వారా రైతులకే కాక దేశంలోని పేద ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘న్యాయ్‌’ పథకం నిధుల కేటాయింపుపై ప్రత్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలపై స్పందించిన ఆయన ఆర్థిక విషయాల పట్ల ఎలాంటి అవగాహన లేనివారే లేనిపోని ఆరోపణలకు దిగుతారని వ్యాఖ్యానించారు. న్యాయ్‌ అమలుకు రూ.3.6లక్షల కోట్లు అవసరమని ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.8 శాతమని వివరించారు. రానున్న ఐదేళ్లలో జీడీపీ 400లక్షల కోట్లకు చేరుతుందని.. అప్పుడు కేవలం ఒక శాతం నిధులు మాత్రమే అవసరమని తెలిపారు. కాంగ్రెస్‌ ఒక జాతీయ పార్టీ అని..దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే మేనిఫెస్టో రూపకల్పన చేసిందన్నారు. ప్రాంతీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదన్నారు. భాజపా హయాంలో పేదరికం ఏమాత్రం తగ్గలేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ స్థానంలో పలు మార్పులతో కూడిన జీఎస్టీ-2.0ను తీసుకువస్తామని తెలిపారు. ఈసారి తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి భారీ మెజారిటీ సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Posts