YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజకీయ నాయకుల బయోపిక్‌లకు ఈసి చెక్ నిలిచిపోయిన ప్రదాని నరేంద్ర మోదీ సినిమా

 రాజకీయ నాయకుల బయోపిక్‌లకు ఈసి చెక్     నిలిచిపోయిన ప్రదాని నరేంద్ర మోదీ సినిమా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు పీఎం నరేంద్రమోదీ, సహా ఎలాంటి బయోపిక్‌లు విడుదల చేయరాదని ఆదేశించింది. రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్‌లూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు.అని ఈసీ స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన పీఎం నరేంద్ర మోదీ, సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాలో ప్రధాని మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు.కాగా ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలన్న దానిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమనీ... ఎన్నికల సంఘమే దీన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ బయోపిక్ కారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి లాభమో కాదో కూడా ఈసీనే తేల్చాలని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పీఎం నరేంద్రమోదీ, చిత్ర నిర్మాతలకుబీజేపీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. నిర్మాతలు, బీజేపీ నుంచి వివరణ తీసుకున్న అనంతరం సినిమా విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Related Posts