యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. గురువారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్దమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. దీని కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు ముమ్మరం చేసింది.రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. బుధవారం ఈవిఎంలను తరలింపు ప్రక్రియను ముమ్మరం చేశారు. పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంటు, 19 శాసనసభ నియోజకవర్గాలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి.దీని కోసం అధికారులు విస్త్తత స్ధాయిలో ఏర్పాటు 42 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు.4,500 పోలింగ్ కేంధ్రాలను సిద్దం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 42,04,436 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా జనాభాలో ఓటర్ల నిష్పత్తి ప్రతి వెయ్యి మంది జనాభాకు 730 మంది ఉండగా.. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,020 మంది మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం. అర్హులైన ఓటర్లకు అనువుగా ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సంబంధిత సిబ్బందికి సూచించారు. జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం మినహా మిగిలిన అన్నిచోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రంపచోడవరం నియోజకవ ర్గంలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.