యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒకవైపు పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తుండగా,నరేంద్రమోదీయే మళ్లీ ప్రధానమంత్రి కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరుకుంటున్నారు. మోదీ మళ్లీ అధికారం చేపడితే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఎక్కువగా జరుగుతాయని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఒక వేళ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కశ్మీర్ పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భయపడొచ్చు. కారణం దానికి రైట్ వింగ్‌తో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే బీజేపీ అయితే హిందుత్వ పార్టీయే కాబట్టి మోదీ అధికారంలోకి వస్తే కశ్మీర్‌కు సంబంధించిన కొన్ని విషయాల్లో తొందరగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అని పేర్కొన్నారు..అయితే ఇప్పుడు ఇండియాలో రాజకీయాలు ఎలా ఉన్నాయో, అసలు ఏం జరుగుతుందో తనకు తెలియదని ఇమ్రాన్ అన్నారు. ఇండియాలో ఎన్నో ఏళ్లుగా సురక్షితంగా ఉన్న విషయం ముస్లింలకు తెలుసని ప్రస్తుతం పెరిగపోయిన విపరీత హిందుత్వ జాతీయవాదాన్ని వారు పసిగట్టారని చెప్పారుబీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని కాంగ్రెస్ భావించి పాకిస్థాన్ తో ఒప్పందాలకు కాంగ్రెస్ వెనుకాడుతుందని ఆయన అన్నారు.. కశ్మీర్‌లో ఎన్నో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ ను బీజేపీ రద్దు చేస్తాననడంపై కశ్మీర్‌లో ఆందోళన పరిస్థితులను రెచ్చగొడుతోందని అన్నారు. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఘటనను ఆయన ఖండించారు. పాకిస్తాన్‌కు చెందిన తీవ్ర వాద సంస్థ జైషే మహ్మద్.. తమ పనేనని చెప్పింది. అయితే ఆ ఘటనకు పాకిస్తాన్ బాధ్యత వహించలేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.