YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370కింద ప్రత్యేక హోదాఫై సర్వత్రా చర్చ

కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370కింద  ప్రత్యేక హోదాఫై సర్వత్రా చర్చ
ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ పార్టీ ఓ కొత్త వాగ్దానం చేసింది. పాకిస్థాన్,  భారత్‌ మధ్య చిచ్చుగా మారిన కశ్మీర్‌ను.. సమస్యల వలయం నుంచి విముక్తి చేసేందుకు బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఈ ఎత్తును ఎత్తుకున్నది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ఆర్టికల్‌ ఏలను రద్దు చేస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఇంతకీ ఆ ఆర్టికల్స్‌ ఏంటని వివరాల్లోకి వెల్తే...భారత రాజ్యాంగం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఈ ఆర్టికల్‌ స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ పార్ట్‌లో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్‌ 370కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగితా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 1947లో షేక్‌ అబ్దుల్లా ఈ ఆర్టికల్‌ ముసాయిదాను తయారు చేశారు. రాజా హరిసింగ్‌నెహ్రూ ఆదేశాల ప్రకారమే.. అబ్దుల్లా ఆర్టికల్‌ ముసాయిదాను రూపొందించారు. ఆర్టికల్‌ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగితా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం ఓకే అంటేనే.. అప్పుడు పార్లమెంట్‌ మిగితా చట్టాలను అమలు చేస్తుంది. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తారన్న విషయం అర్థమవుతోంది. పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్‌షిప్, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఉంటాయి. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనే అవకాశం ఉండదు. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ని రద్దు చేస్తామని మోదీ అన్నారు.ఆర్టికల్‌ 35ఏ..
ఇదో ప్రత్యేక నిబంధన. జమ్మూకశ్మీర్‌ కోసం ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. కశ్మీర్‌లో ఎవరు శాశ్వత నివాసితులో తేల్చేందుకు ఆర్టికల్‌ 35 ఏను తీసుకొచ్చారు. కశ్మీర్‌లోని పర్మనెంట్‌ రెసిడెంట్స్‌కు ప్రత్యేక హక్కులను కూడా ఈ ఆర్టికల్‌ కల్పిస్తుంది. ఈ అధికరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుంది. స్థిరాస్థి కొనుగోలు కూడా జరుగాయి. ప్రజాసంక్షేమ పథకాల అమలు కూడా జరుగుతుంది. 1954లో ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370(1) (డీ) ప్రకారం కశ్మీర్‌ అంశంపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర అంశంలో ఎవరైనా మార్పులు చేయాలంటే.. రాష్ట్రపతికి ప్రత్యేక హక్కులు కల్పించారు. అయితే ఆర్టికల్‌ 35ఏ అక్రమపద్ధతిలో రాజ్యాంగంలో పొందుపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టికల్‌370 370 ద్వారా.. ఆర్టికల్‌ 35 ఏ లాంటి కొత్త అధికరణలను తీసుకురావడం సరికాదు అని కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. 35ఏ ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలకు కశ్మీర్‌లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ప్రాపర్టీని ఖరీదు చేయకుండా నిలువరించడం.. రాజ్యాంగంలోని 14,19,21  అధికరణలను ఉల్లంఘించినట్లు అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పదంగా మారిన ఆర్టికల్‌ 370 ఆర్టికల్‌ 35 ఏపై ఇటీవల సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. రాజ్యాంగ ధర్మాసనమే వీటిపై నిర్ణయం తీసుకోవాలని మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఓ తీర్పులో అభిప్రాయపడ్డారు.

Related Posts