దేశంలో హిందువులు, ముస్లింల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అజాంఖాన్ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడ జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో అజాంఖాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ ముస్లింలు అనే టాపిక్ మినహా మోదీకి మాట్లాడేందుకు అంశమే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మోదీజీ...మీరు ఎంతసేపూ పాకిస్థాన్ అంటారుముస్లింలు అంటారు. దేశంలో హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టింస్తుటారు. హిందువుల హృదయాల్లో ముస్లింలపై విద్వేషాన్ని నింపుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. దేశాన్ని ఏలే పాలకుడు అబద్ధాలుకోరు కాకూడదని అబద్ధాలు చెప్పే నేత పాలకుడు కారాదని అజాంఖాన్ అన్నారు.రాబోయే ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాలు తమ సత్తా చాటాలని అజాంఖాన్ పిలుపునిచ్చారు. దళిత, వెనుకబడిన వర్గాల్లో ఉన్న మిత్రులారా...మీరు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరవేయాలో నిర్ణయించుకునే అవకాశం70 ఏళ్ల తర్వాత మీకు వచ్చింది. ఎర్రకోటపై జెండా ఎగరేసే హక్కు మీకూ ఉంది అని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ మాజీ నేతలు అమర్ సింగ్, జయప్రదపై అజాంఖాన్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. రాంపూర్యూపీ రాజకీయాల్లో తాను పరిచయం చేసిన వ్యక్తులు ఇప్పుడు తనకు తన రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలనుకుంటున్నారని అన్నారు. రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అజంఖాన్‌పై బీజేపీ అభ్యర్థిగా జయప్రద ఈసారి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకూ జరిగే ఏడు విడతల పోలింగ్‌లోనూ ఉత్తరప్రదేశ్ ఉంది.