YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

350 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

350 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 354 పాయింట్ల మేర కుప్పకూలింది. 38,585 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 11,584 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇండెక్స్ 11,600 స్థాయిని కోల్పోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.నిఫ్టీ 50లో టాటా మోటార్స్, సిప్లా, విప్రో, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, ఐఓసీ, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ ఏకంగా 5 శాతం మేర లాభపడింది. అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్, హిందాల్కో, ఏసియన్ పెయింట్స్, టీసీఎస్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్ దాదాపు 4 శాతం పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి.

Related Posts