రాఫ్తాడులో దౌర్జన్యాలకు పాల్పడటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. గెలుపు కోసం వైసిపి నేరాలు-ఘోరాలకు పాల్పడుతోంది. అరాచకాలు చేస్తోంది, బీభత్సాలు సృష్టిస్తోందని ఆరోపించారు. తాడిపత్రిలో జరిగిన టీడీపీ నేత భాస్కరరెడ్డి హత్యను అయన ఖండించారు. అలాగే సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలపై జరిగిన దాడిని ఖండించారు. ఓటర్లను పోలింగ్ కు రాకుండా చేయాలనే ఈ బీభత్సాలు హత్యా రాజకీయాలకు వైసిపి పాల్పడటాన్నిప్రజలంతా నిరసించాలి. ఓటమి భయంతోనే హత్యలు,హింసా విధ్వంసాలకు వైసిపి తెగించిందని అన్నారు. బిజెపి, టిఆర్ ఎస్ మద్దతుతో వైసిపి పేట్రేగిపోతోంది. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సింది ఓటర్లే నని అయన అన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించాలి. ధైర్యంగా ఓటు వేయడం ద్వారా వీళ్లకు బుద్ది చెప్పాలని అన్నారు. ప్రతిఒక్కరూ ఓటు వేయడమే ప్రజా విజయం. ఓటు హక్కు వినియోగమే నేరగాళ్లకు అపజయమని అన్నారు. ఈ ఎన్నిక రాష్ట్రంలో శాంతిస్థాపనకు నాంది కావాలి. నేరాలు, ఘోరాల పార్టీకి గుణపాఠం కావాలని అయన అన్నారు.