YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రాస్ ఓటింగ్ కొంపముంచుతుందా

 క్రాస్ ఓటింగ్ కొంపముంచుతుందా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైపోయింది. పోలింగ్ శాతం పెరగడం.. మహిళలు, వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొనడం పార్టీల్లో గుబులు రేపుతోంది. ప్రధాన పార్టీలు.. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నా.. లో లోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. గ్రామాలవారీగా గెలుపుపై లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోందట. మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు పోటీ ఉంటే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య పోరు జరిగింది. ద్విముఖ, త్రిముఖ పోరుల్లో కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొత్తవారు కావడం, స్థానికత అంశం ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థుల చరిష్మా కూడా క్రాస్ ఓటింగ్‌కు దారి తీసిందనే చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజకవర్గాల్లో.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. కొన్నిచోట్ల అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసి.. లోక్‌సభ అభ్యర్థికి మాత్రం ఓటు మార్చేశారట. మరికొన్ని చోట్ల లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేసి.. అసెంబ్లీ అభ్యర్థికి మాత్రం పార్టీని మార్చేశారట. రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ఈ క్రాస్ ఓటింగ్ టెన్షన్ వెంటాడుతోంది. ఇదే జరిగితే ఫలితాలు కాస్త భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్రిముఖ పోరు ఉన్న నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్‌కు ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీచేసిన స్థానాల్లో కూడా ఓట్ల చీలిక ఉంటుందని.. అక్కడా క్రాస్ ఓటింగ్‌ ఖాయమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్థులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశముందనేది విశ్లేషకుల మాట.క్రాస్ ఓటింగ్ కనుక జరిగితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఎవరి కొంపు ముంచుతుందోనని తెగ హైరానా పడిపోతున్నారట. నియోజకవర్గంలో బూతులవారీగా వివరాలు తెప్పించుకొని సమీక్ష చేసుకునే పనిలో ఉన్నారట. మెజార్టీ, గెలుపు, ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారట. ఎన్ని లెక్కలు వేసుకున్నా.. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది కాబట్టి చేసేదేమీ లేదు మరి. ఈ క్రాస్ ఓటింగ్ ఎవర్ని ముంచబోతుందో తేలాలంటే మే 23 వవరకు ఆగాల్సిందే. మరో వైపు నెలరోజులుగా ఉత్కంఠను కలిగించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ముగిశాయి. ఎన్నో వివాదాలు, ఘర్షణల నడుమ పోలింగ్ ముగిసింది. ఈవీఎంలు మొరాయించడం, రాజకీయ పార్టీల కార్యకర్తలు గొడవలకు దిగడంతో కొన్నిచోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఎవరికి వారు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే అన్ని పార్టీలు తమకే ఎక్కు సీట్లు వస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తొలినుంచీ ఆసక్తి రేపుతున్న విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు లాభం చేకూరుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గాజువాక అసెంబ్లీ సీటు నుంచి పోటీచేస్తున్న పవన్‌కళ్యాణ్ మినహా మిగిలిన చోట్ల జనసేన అభ్యర్థులు బలహీనంగానే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు తెలిసినవారు కాకపోవడంతో అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. ఆయన ప్రత్యర్థులైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అన్నిరకాలా బలవంతులు కావడంతో లక్ష్మీనారాయణకు కష్టమేనన్న భావన ఎన్నికల ఉండేది. అయితే గురువారం జరిగిన ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌పై అక్రమాస్తుల కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో చాలామంది ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే నివాసం ఉంటానని ఆయన చెప్పడంతో ప్రజల్లో సానుకూతల వచ్చినట్లు తెలుస్తోంది. తన హామీలను బాండ్ పేపర్‌పై రాసి తాను నెరవేర్చకపోతే కేసులు వేసుకోవచ్చని చెప్పడం కూడా ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు తమ పార్టీ అభ్యర్థులకు ఓటేసినా.. ఎంపీ స్థానానికొచ్చేటప్పటికీ లక్ష్మీనారాయణ వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. 

Related Posts