YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ గెలుపు గుర్రం ఎవరిది

విశాఖ గెలుపు గుర్రం ఎవరిది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విశాఖ లోక్ సభ స్థానం విజయావకాశాలపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ హేమాహేమీలు పోటీ పడటంతో ఎవరిది విజయమన్నది ఖాయంగా తేలడం లేదు. ప్రతి పార్టీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. విశాఖ పార్లమెంటుస్థానంలో చతుర్ముఖ పోటీ జరిగిందనే చెప్పాలి. విశాఖ నగరం కావడం…ఎక్కువ మంది మేధావులు, విద్యావంతులు ఓటర్ల గా ఉండటంతో ఎవరి వైపు మొగ్గు చూపారన్న ఆసక్తి కర చర్చ జరుగుతోంది.విశాఖ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంవీవీఎస్ మూర్తి మనవడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ తరుపున ఎన్టీరామారావు కుమార్తె పురంద్రీశ్వరి పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంవీవీఎస్ సత్యనారాయణ, జనసేన తరుపున సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా కొమ్ము కాస్తున్న సామాజిక వర్గం సయితం పురంద్రీశ్వరి వైపు మొగ్గు చూపడంతో ఆమె విజయంపై ధీమాగా ఉన్నారు.మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సర్వేలు రావడంతో పురంద్రీశ్వరి నెగ్గితే కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం బాగా జరగడం పురంద్రీశ్వరికి కలసి వస్తుందంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కు పెద్దగా విజయావకాశాలు లేవంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా విద్యావంతులు, తటస్థులు బీజేపీ వైైపే మొగ్గు చూపుతారన్న అంచనాలను కమలం పార్టీ వేసుకుంటుంది. ఇక జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.లక్ష్మీనారాయణ క్రాస్ ఓ‌టింగ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. తాను సీబీఐ జేడీగా రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్న ఇమేజ్ తనను గెలుపు గుర్రం ఎక్కిస్తుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల నుంచి ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని, పవన్ కల్యాణ్ ఇమేజ్ కూడా తన గెలుపునకు దోహదపడుతుందని లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. మొత్తం మీద విశాఖ ఎంపీ స్థానం రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను రేపుతుంది.

Related Posts