యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు డబ్బు, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టాయి. బీహార్ లో పాత రోజులు గుర్తు చేసే విధంగా వ్యవహరించాయి. ఎపి లో ధన రాజకీయాలతో అధికారం లోకి వచ్చేందుకు ఆరాటపడ్డారని బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం అయన మీడియతో మాట్లడారు. వేల రూపాయలను పంపిణీ చేస్తూ ఓట్లు కొనుగోలు చేశారు. ప్రజలకు విజ్ఞప్తి చేసినా.. వారు కూడా డబ్బుకు అమ్ముడుపోయారు. ఎన్నికల సంఘం కూడా ఓటు కొనుగోలు చేయవద్దంటూ మరింత ప్రచారం చేయాల్సింది. పెట్టుబడుల సంస్కృతి కారణంగా నిజంగా పని చేసేవారు రాజకీయాల్లో ఇమడలేక పోతున్నారని అయన అన్నారు. ఈ ధన ప్రవాహం పై చంద్రబాబు, జగన్ కూడా స్పందిస్తారని ఆశిస్తున్నా. ఈ ఎన్నికలలో ఎపి ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యే ల పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. భారీ సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యే లు ఓడిపోవడం ఖాయం. ఐదేళ్ల పాలనలో వ్యవస్థ లను నాశనం చేసి ప్రజా ధనాన్ని దోచుకున్నారు. సొంతం గా ఇళ్లు నిర్మించుకునే వారిని కూడా వదలకుండా డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. దశాబ్ద కాలంగా నాకున్న అనుభవంతో చెబుతున్నా.. టిడిపి ఓటమి చెందడం ఖాయం. చంద్రబాబు కూడా తన స్థాయిని మరచి దుర్మార్గంగా రాజకీయాలు చేశారు. తప్పుడు విమర్శల ద్వారా ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని అయన అన్నారు. ప్రత్యేక హోదా అంటూ బీజేపిని టార్గెట్ చేసినా.. ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే లేదు. ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీ కి ప్రాంతీయ పార్టీలకు వేసినా.. పార్లమెంటు కు బీజేపీ కే ఓటు పడింది. ఎన్నికలకు మరి కొంత సమయం ఉండుంటే.. బిజేపి కూడా మంచి ఫలితాలు సాధించేది. భవిష్యత్తు లో బిజెపి ని రాష్ట్రం లో మరింత బలోపేతం చేస్తామని అయన అన్నారు. పంచాయతి ఎన్నికలు రాబోతున్నాయి.. గ్రామ స్థాయి నుంచి పార్టీ ని మరింత పటిష్టం చేస్తాం. ఈరోజు గుంటూరు లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు ప్రణాళిక ను రూపొందిస్తాం. ఎపి లో టిడిపి కనుమరుగు కావడం ఖాయం.. వైసిపి అధికారం లోకి వస్తుంది. చంద్రబాబు బిజెపి పై తప్పుడు ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూశారు. కేసిఆర్, ప్రతిపక్ష పార్టీలను కాపీ కొట్టి కాపీ బాబుగా పేరు గడించారు. కేంద్ర పధకాలు కు స్టిక్కర్ అంటించుకుని ఇప్పటికే స్టిక్కర్ బాబు గా మారాడని ఆరో్పించారు. కనుమరుగవుతున్న టిడిపి స్థానాన్ని ఎపిలో బిజెపి భర్తీ చేస్తుంది.