యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గురువారం ఒక చరిత్రాత్మక రోజు. నన్ను పెద్దకొడుకు, అన్న, కుటుంబ పెద్దగా నమ్మి ఓటు వేసిన అందరికీ పాదాభివందనం చేస్తున్ననని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. మోడీ, కేసీఆర్, ఒక ఆర్థిక ఉగ్రవాది తో పోరాడవాల్సి వచ్చింది. సర్వ శక్తులూ నా మీద ఒడ్డారు. అదాయపు పన్ను, ఈడీ, సీబీఐ తో పాటు అన్నీ ప్రయోగించారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఎండను కూడా లెక్కపెట్టకుండా వచ్చి ఓట్లేశారు. సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ హైవేలో ఉండే ట్రాఫిక్ జామ్లు నిన్న ఉన్నవి. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, పూనే నుంచి జన్మభూమిని నిలబెట్టేందుకు వచ్చారని అయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని స్థిర నిశ్చయంతో వచ్చారు. ప్రజల్ని నిన్న ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. ఎంత హింసాత్మకం చేయాలో అంతా చేశారు.పోలింగ్లో కుట్ర చేశారు. ప్రారంభంలో 35 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఉదయం నేను అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను. వయలెన్స్ చేయబోతున్నారు. జాగ్రత్తగా వుండమని ఈసీకి చెప్పాం. మేము చెప్పినదేమీ పట్టించుకోకుండా సీనియర్ అధికారులందరినీ మార్చేశారని అన్నారు.