YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీలను టెన్షన్ లో పెట్టేసిన ఓటరు

 పార్టీలను టెన్షన్ లో పెట్టేసిన ఓటరు
ఎన్నిక ముగిసింది. కౌంటింగ్ మిగిలే ఉంది. సుదీర్ఘ నిరీక్షణ. ఎవ్వరి ముఖంలోనూ కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. ఏం జరుగుతుందో తెలియదు. తామే గెలుస్తున్నామన్న కాన్షిడెన్సు ఏ నేతలోనూ కనిపించలేదు. అధికార,ప్రతిపక్షాల నుంచి డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకున్నారు. తాము ఎన్నికోట్లు ఖర్చు పెట్టామనేది లెక్కలు వేసుకోవడమే మిగిలింది. అన్నిపార్టీలనూ ఓటరు టెన్షన్ లోనే పెట్టేశాడు. అందుకే ప్రధానపార్టీల నేతలు సైలెంట్ అయిపోయారు. అధికారం కోసం తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న పార్టీలు ఎన్నికల రోజు రోడ్డెక్కాయి. ప్రత్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు. తాము సచ్ఛీలురమని ప్రజలకు చెప్పేందుకే యత్నించారు. పోలింగు రోజున ప్రధానపార్టీల నాయకుల తీరుతెన్నులు, ముఖ కవళికలను విశ్లేషించుకుంటే తమకు ఆధిక్యముందని చెప్పలేని దయనీయపరిస్థితే కనిపించింది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించాయి. ఎన్నికల కమిషన్ వైఫల్యాలను సైతం ప్రధాన ప్రతిపక్షానికే ఆపాదించారు. రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ఘర్షణలు, వందలాది ఈవీఎంలు పనిచేయక మొరాయించడం వంటివన్నీ కమిషన్ తప్పిదాలే. వైసీపీ ని ఎలక్షన్ కమిషన్ ను కలగలిపి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో వైసీపీ మాత్రం కమిషన్ నిష్పాక్షికంగా పనిచేస్తోందని కితాబు నిచ్చింది. అధికార యంత్రాంగం సైతం సామాజిక వర్గాల వారీగా చీలిపోయిన తీరు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అసలు ఫలితమెలా ఉంటుందన్న సూచనలు అందకపోవడం విచిత్రం. దీనికి గడచిన కొంతకాలంగా రాష్ట్రంలో సాగుతున్న పొలిటికల్ పోలరైజేషన్ కూడా కారణమని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఘర్షణలు ఎక్కువగా కనిపించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే తాజా చిత్రం బహుముఖం కావడంతో తాడోపేడో తేల్చుకోవాలన్న ధోరణి మూడు పార్టీల్లోనూ కనిపించింది. స్వచ్ఛమైన రాజకీయాలు నడుపుతామంటూ ప్రకటించిన జనసేన ఆమేరకు కొంత మార్పును ఓటర్ల ముందు ఆవిష్కరించగలిగింది. ధనరాజకీయాలు వద్దంటూ పిలుపునిచ్చిన జనసేన ఆమేరకు మాటపై నిలబడింది. పాటించకపోయినా కనీసం ఆమేరకు పిలుపునివ్వడానికే సాహసించలేదు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు. స్వచ్చరాజకీయాల టాగ్ పెట్టుకున్న జనసేనకు తన వాటా తనకు లభించింది. జనసేన అభ్యర్థులెవరూ తమకు డబ్బు ఇవ్వలేదని ఓటర్లు చెప్పడం విశేషం.  28 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో గెలుపోటములు నిర్ణయించుకునేందుకు గట్టిగా పోరాడాలని ఇరుపార్టీలు నిర్ణయించుకున్నాయి. దాంతో గొడవలు ఎక్కువయ్యాయి. 2014తో పోలిస్తే ఈసారి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం ఇద్దరు నేతలూ జీవన్మరణ సమస్యగా తీసుకోవడమే.ఓటర్లను ప్రభావితం చేయడానికి రెండు పార్టీలు సైకలాజికల్ గేమ్ ను సమర్థంగా ఆడాయనే చెప్పాలి. ప్రధాన స్రవంతిలోని మీడియా రెండుగా విడిపోయి ఉండటంతో తమకు అనుకూలమైన వార్తలు ప్రసారం చేయించుకోవడానికి, వాస్తవాలను మసిపూసి మారేడు కాయ చేయడానికి శతవిధాలుగా యత్నించారు. ఎదుటి పార్టీ అక్రమాలు చేస్తోందంటూ ముందుగా తెలుగుదేశం ప్రచార దాడి మొదలు పెట్టింది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో గొడవలకు ప్రధానప్రతిపక్షమే కారణమన్నట్లుగా ఫోకస్ చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. తద్వారా తటస్థ ఓటర్లు, సానుభూతిపరులను పోలరైజేషన్ చేయాలనే ఎత్తుగడ వేసింది. వైసీపీ అధికారంలోకి రాకుండానే హింసాత్మక ఘటనలకు దిగుతోంది. పవర్ దక్కితే అంతే సంగతులనే భావనను ఓటర్లలో రేకెత్తించడం టీడీపీ ఉద్దేశం. ముందుగా ఈ విషయాన్ని గ్రహించని వైసీపీ ఓడిపోతున్నాననే దుగ్ఢతో టీడీపీ నానాయాగీ చేస్తోందని భావించింది. సంబరాలు చేసుకుంది. ఈలోపుగానే జరగాల్సిన డామేజీ అయిపోయింది. ఈవీఎంల లోపాలు మొదలు అన్నిటినీ ఏకరవు పెడుతూ టీడీపీ ఎన్నికల కమిషన్ పైనే విమర్శలు సంధించింది. తమ ఆలోచనలకు విరుద్దంగా, అన్యాయంగా ఏదో సాగుతోందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తేగలిగింది. సైకలాజికల్ గా టీడీపీకి ఇది అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగి ఏపీ ఓటర్లకు విజ్ఝప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఓటర్ల కరుణాకటాక్షణలు పొందేందుకు యత్నించారు. వైసీపీ ఆలస్యంగా పత్రికాప్రకటన విడుదల చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ అయిపోయింది.ప్రచారంలోనూ, ఓటింగు పోలరైజేషన్ లోనూ అంతా హేమీహేమీలే. సామాజిక వర్గాల నుంచి బలమైన మద్దతు లభించడంతో ఓటర్ల తరలింపు, డబ్బు పంపిణీలో టీడీపీ, వైసీపీలు నువ్వా? నేనా? అన్నట్లుగా తలపడ్డాయి. నాయకుల ముఖ కవళికలు చూసినవారికి వారిలోనెలకొన్న భయం స్పష్టంగా కనిపించింది. చివరియత్నాల్లో వారు పడుతున్న పాట్లు స్పష్టంగా అర్థమై నవ్వు పుట్టించాయి. నిరాశ,నిస్ప్రుహలు సైతం దాచకోలేకపోయారు. అందువల్లనే ఎవరు నెగ్గుతారనే విషయంలో స్పష్టమైన పిక్చర్ ఏర్పడలేదు. కులాలు ప్రధానపార్టీలను అక్కున చేర్చుకున్నాయి. మహిళలు తమకు లభించిన ఆర్థిక లబ్ధిని ద్రుష్టిలో పెట్టుకున్నారు. యువత మార్పును కోరుకొంటున్నట్లుగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ లాస్ట్ లాఫ్ ఎవరిదన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు పడిన ఓటింగు టీడీపీ విజయావకాశాలను పది పన్నెండు నియోజకవర్గాల్లో దెబ్బతీసినట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలాగే వైసీపీ నెగ్గాల్సిన నాలుగు నియోజకవర్గాల్లో యువతరం ఓట్లను జనసేన చీల్చడం వల్ల ప్రధాన ప్రతిపక్షానికి దెబ్బ తగిలినట్లుగా లెక్కిస్తున్నారు. రాయలసీమలోనూ మూడు నియోజకవర్గాల్లోజనసేనకు గణనీయంగానే ఓట్లు దక్కాయని ప్రధానపక్షాలకు సవాల్ విసిరిందని రాజకీయ పండితుల విశ్లేషణ. ఏదేమైనప్పటికీ మరో 41 రోజులపాటు వేచి చూస్తేనే తప్ప రాజు, తరాజులను తేల్చలేం. చివరి విడత ఎన్నికలోపు అధికారికంగా ఎగ్జిట్ పోల్సునూ వెల్లడించకూడదు. అందువల్ల అనధికారిక సమాచారాన్ని విశ్లేషించుకుంటూ రాజకీయపార్టీలు దినమొక యుగంగా 

Related Posts