YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవరికి ప్లస్...ఎవరికి మైనస్

 ఎవరికి ప్లస్...ఎవరికి మైనస్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎవరికి వారు మా పార్టీనే గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నారు గానీ... యుూత్ ఓటింగ్ ఎక్కువుందని మేము గెలుస్తామని వైసీపీ అనుకుంటూ ఉంటే.... మహిళా ఓటింగ్ బాగుంది కాబట్టి మేమే గెలుస్తాం అని టీడీపీ అనుకుంటూ ఉంది. దీంతో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు గాని... ఎవరి బలాలు ఏంటో చూద్దాం.
వైసీపీ ఓట్లు కురిపించిన పాయింట్లు
- కొత్త ఆశ కల్పించే మ్యానిఫెస్టో. ముఖ్యంగా బడికి పంపితే తల్లికి డబ్బులు, 45 ఏళ్లు నిండితే 75 వేలు ఇవ్వడం.
- ప్రభుత్వ వ్యతిరేకత. పవన్ కళ్యాణ్ ఎంత చీల్చాడు అన్నదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉటుంది.
- నిరక్షరాస్యుల్లో ఎక్కువమంది ఒక్కసారి అవకాశమిద్దామన్న ఆలోచన
- ఉద్యోగవర్గాల ఓట్లు, వీళ్లు ఎపుడూ బాబుకు వ్యతిరేకమే.
- సుదీర్ఘ పాదయాత్ర
- అవిశ్రాంతంగా ప్రజల్లో ఉండటం. ఇది జనరల్గా ప్రతిపక్షాలకు ఎపుడూ ప్లస్సే.
- సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మెజారిటీ వైసీపీ వైపు ఉండటం
- చంద్రబాబును సక్సెస్ ఫుల్గా డీమోరల్ చేయగలగడం,
- కాపు ఓటు ను చీల్చగలగడం.
టీడీపీకి లాభించిన అంశాలు
- పుసుపు కుంకుమ వల్ల మహిళలు, పింఛను వల్ల వృద్ధుల ఓట్లు
- 35 సంవత్సరాలు దాటిన న్యూట్రల్ వర్గాల ఓట్లు
- ముఖ్యమంత్రికి ఉన్నవిజన్, అనుభవం, సమర్థత, అవిశ్రాంతంగా పనిచేయడం.
- ఇప్పటికే అనేక కంపెనీలను తీసుకురాగలగడం
- నీటి విషయంలో చంద్రబాబు పూర్తిగా మారడం... రాయలసీమలో ఇంతవరకు నీటి సదుపాయం లేని ప్రాంతానికి నీరు ఇవ్వగలగడం.
- రాజధాని నిర్మాణంలో పెద్దగా సఫలం కాకపోయినా అది కట్టగలిగిన శక్తి బాబుకు ఉందని ప్రజలు నమ్మడం
- పోలవరం, పట్టిసీమలో పురోగతి
 
కొసమెరుపు ఏంటంటే... వైసీపీ వస్తే ఎంతో కొంత జరుగుతున్న అభివృద్ది పనులు ఆగిపోతాయన్న భయం కూడా టీడీపీకి బలంగా మారినట్లు తెలుస్తోంది. జగన్ వస్తే అరాచకత్వం, రౌడీయిజం పెరుగుతుందని ఆందోళన ఇంకా కోస్తా జిల్లాల ప్రజల్లో పోలేదు. గుంటూరు కృష్ణా వాళ్లకు రాజధాని తరలిపోతుందనే భయంతో జగన్ పై అభిమానం ఉన్నా ఓటు వేయలేదని అంటున్నారు

Related Posts