ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరువూరులోని నాగార్జున మెరిట్ స్కూల్ యుకెజి చదివే విద్యార్థి హఫీజ్ ను ఆ స్కూల్ ఉపాద్యాయురాలు లలిత చితకబాదేసింది. అదే పాఠశాలలో 6,వ తరగతి చదివే గూడూరు వెంకట నర్సింహారెడ్డి అనే విద్యార్థుడ్ని కూడా సోషల్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు రమేష్ కర్రతో కొట్టడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.ఇరువురిది తిరువూరు మండలం మునకుళ్ల కావటం విశేషం.విషయం నిన్న జరిగినప్పటికీ హాఫిజ్ అనే బాలుడ్ని నిన్న సాయంత్రం స్నానం చేయించేందుకు చూడగా వంటిమీద ఎర్రగా కమిలిపోయిన వాటాలు కనబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది..విషయం బయటకు పొక్కకుండా ఇరువురి మధ్య సామరస్య వాతావరణం కలిగించేందుకు పెద్ద మనుషులు రంగ ప్రవేశం చేశారు.
ముక్కు పచ్చలారని పసివాడ్ని గొడ్డును బాదినట్టుగా బాదటానికి మనస్సు ఎలా వచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.. ఏదైనా కూడా విద్యాహక్కు చట్ట ప్రకారం ఎల్ కేజీ, యూకేజీ లేనప్పటికీ వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసే ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వెనుక అంతర్యం ఏమిటని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.