YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్ శ్రీరాజేష్ కుమార్ భట్టార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
తలంబ్రాల తయారీ : 
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ఇందులో భాగంగా బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్బాబు, ఏఈవోశ్రీ రామరాజు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  మునిరత్నంరెడ్డి, డెప్యూటీ ఈవో  దేవేంద్రబాబు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనం : 
 పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రాయామణ కల్పవృక్షం తదితర అంశాలపై ప్రముఖ కవులు సమ్మేళనం నిర్వహిస్తారు.

Related Posts