యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమలలో వీఐపీ దర్శనానికి సంబంధించి వారాంతంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా బ్రేక్ దర్శనాన్ని రద్దుచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిని ఈ నెల 19వ తేదీ నుంచి అమలు చేస్తుండడంతో 18 నుంచే సిఫారసుల స్వీకరణ నిలిపివేయనున్నారు. ఏటా వేసవిలో టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ర్టాల్లో పోలింగు ముగియడం, రోజుల వ్యవధిలో పరీక్ష ఫలితాలు వెలువడనుండటం, వేసవి సెలవులు, ఇతర సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరగనుంది. వారాంతాల్లో మరింత ఎక్కువగా రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వారాంతంలో వీఐపీ బ్రేక్ టిక్కెట్ల జారీని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.