యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసే ప్రతి పనిలో సరిగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలన్నది ఆయన పాలసి. ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలతో పాటు ప్రకటనలలోను నటిస్తూ ఉన్న బిగ్ బీ ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. ఆ మధ్య ముజఫర్‌నగర్‌లోని 2084మంది రైతుల రుణాలను చెల్లించారు. ఫిబ్రవరిలో జరిగన పుల్వామా దాడిలో అమరులైన దాదాపు 40 మంది జవాన్ల కుటుంబాలకు పదిలక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అయితే అమితాబ్ తాజాగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 70కోట్ల రూపాయలను పన్నుగా చెల్లించినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. అమితాబ్ అంత మొత్తంలో ట్యాక్స్ కట్టాడనే విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల బాద్లా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బీ సైరా చిత్రంలో రాజగురువు పాత్ర పోషించారు. బ్రహ్మస్త్రా అనే భారీ బడ్జెట్ చిత్రంలోను నటించారు. ఇక ఉయర్నత మనిథన్ అనే చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ్‌వానన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.