YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈసీ ఘోర వైఫల్యం

ఈసీ ఘోర వైఫల్యం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం డిల్లీలో సీఈసీ సునీల్ అరోడాతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేశారు. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానన్నారు.  మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ను నిర్వీర్యం చేయాలని చూశారని బాబు ధ్వజమెత్తారు.  ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల వేళ అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చారని ధ్వజమెత్తారు.  దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించి పోయిందన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని,  దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. రాష్ట్రంలో జరిగిన అవకతవకల్ని దేశానికి చాటిచెబుతాం ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అదికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై  వైకాపా ఒక్క మాటా మాట్లాడలేదని విమర్శించారు. 

Related Posts