యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లా బ్రేకింగ్ ని జన్మహక్కుగా భావించే వాళ్లకి గుణపాఠం చెప్పబోతున్నాం. నా విషయంలో ఒక ఎంపీ, రెండు మీడియా సంస్ధలు లా బ్రేక్ చేశాయి. సోమవారం ఒక్కొక్కరిపై 100 కోట్లు పరువునష్టందావా వేయబోతున్నానని వైకాపా నేత పి వరప్రసాద్ వెల్లడించారు. కోల్గెట్ స్కామ్ లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. నన్ను స్కామ్ స్టర్ అన్నారు బ్లాక్ మెయిలర్ అన్నారు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అన్నారు. ఇకనుండి చట్టపరంగా వెళ్లతాను.. వాళ్ల కొవ్వు కరిగేంతవరుకు కోర్టులు చుట్టు తిప్పుతానని అన్నారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు.. జీవితాంతం కోర్టుల చుట్టు తిప్పిస్తా. సీబీఐ కేసులు ఉన్నాయని, మనిలాండరింగ్ ఉన్నాయని ఆరోపించారు. జాతీయ అవార్డ్ వచ్చిన తొలి నిర్మాతని నేను.. అనేక చిత్రాలు తీశాను. నా మీద చేసిన ఆరోపణలపై పేపర్లు తెమ్మనండి..డిబేట్లు అక్కర్లేదు... కోర్టులే చెబుతాయని అయన అన్నారు. పోలింగ్ సమయంలో టీడిపి నేతలు డబ్బులు పంచుతుంటే కొందరు పొలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు.. వారిపైన కూడా ఉన్నతాదికారులకి ఫిర్యాదు చేయబోతున్నానని వివరించారు.