యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
సౌందర్య పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ప్రచారం చేయనని అంటోంది కథానాయిక సాయిపల్లవి. 'మేకప్ అనేది నాకు ఇష్టం వుండదు. మేకప్ వేసుకుంటే మనం మనలా ఉండం, మరొకరిలా వుంటాం. అందుకే నాకు బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం వుండదు. దీనిని దృష్టిలో పెట్టుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ కి ప్రచారం చేయను' అని చెప్పింది సాయిపల్లవి.