యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)-రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ హాజరయ్యారు. అప్పటికే స్టేజిపై ఉన్న మాయావతిని కలిసేందుకు అఖిలేశ్ యాదవ్, అజిత్ సింగ్ వేదికపైకి వెళ్తుడగా బీఎస్పీ కోఆర్డినేటర్ ఒకరు అజిత్‌ను అడ్డుకున్నారు. షూ విప్పి వేదికపైకి వెళ్లాలని చెప్పడంతో అజిత్ తన షూ విప్పక తప్పలేదు.