YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన .. కేటీఆర్

Highlights

  • హెలికాప్టర్‌లోని విహెచ్ఎఫ్ కిట్ నుంచి పొగలు 
  • బ్యాగును చాకచక్యంగా బయటపడేసిన భద్రతా సిబ్బంది
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగానే ఉన్నారు 
కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన .. కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తృటిలో  ప్రమాదం తప్పింది. మంగళవారం ఆదిలాబాద్ పర్యటనకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌లోని ఓ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగ రావడం గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రాతా సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా బయట పడేశారు. ఈ ఘటనపై ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వట్టర్‌లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌లో సంప్రదించానని, సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సీఎం తన ఆదిలాబాద్ పర్యటనను కొనసాగిస్తారని కేటీఆర్ తెలిపారు.

Related Posts