యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. బీజేపీ దిశానిర్దేశంలో కాకుండా.. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో ప్రతిపక్షాల సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. తనకు టెక్నాలజీ తెలుసని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నది తమ తాపత్రయం అన్నారు. ఏపీలో వేలాది మెషీన్లు మొరాయించాయని.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయలేదన్నారు. అంతలో శాంతిభద్రతల సమస్య సృష్టించారని.. అయినా ముందుకు వచ్చి ఓట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని పేర్కొన్నారు. 50శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాల్సిందేనని.. లేనిపక్షంలో సుప్రీం కోర్టుకు వెళతామన్నారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.