YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాత్‌టబ్‌లో ఊపిరాడక చనిపోయింది.

Highlights

 శ్రీదేవి మృతిలో మ‌రో ట్విస్ట్..!  
.తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక‌

ముంబై తరలింపుకు దక్కని అనుమతి 

మరింత  సమయం పట్టే అవకాశాలు

బాత్‌టబ్‌లో ఊపిరాడక చనిపోయింది.

ప్రముఖ నటి  శ్రీదేవి ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి మ‌ర‌ణించిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లో తేలింది. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.  మ‌ద్యం మ‌త్తులో బ్యాలెన్స్ త‌ప్పి.. బాత్‌టబ్‌లో ప‌డ‌టంతో నీటిలో మునిగి ఊపిరాడ‌క ఆమె చ‌నిపోయుంటుంద‌ని వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. 

ఇంకా వీడని సందేహాలుః 
1. అసలేం జరిగింది? - బోనీకపూర్ స్పృహతప్పిన స్థితిలో శ్రీదేవిని చూసి, పోలీసులకు సమాచారమిచ్చిన సమయంలో ఏం జరిగింది?
2. శ్రీదేవి ఖచ్చితంగా ఎన్ని గంటలకు మరణించింది?
3. లోపలివైపు గడియపెట్టిఉన్న బాత్‌రూం తలుపులను బోనీ ఎలా తెరవగలిగారు?
4. బాత్‌టబ్ నిండిఉంది - పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, నిండా నీరు ఉన్న టబ్‌లో శ్రీదేవి కనిపించిదని గల్ఫ్‌న్యూస్ పత్రిక తెలిపింది. డెత్ సర్టిఫికేట్‌లో అనుకోకుండా మునిగి చనిపోయిందని రాసుంది. మరి బాత్‌రూంలోకి శ్రీదేవి వెళ్లకముందే టబ్‌లో నీళ్లు ఎవరు నింపారు?
5. దెబ్బలేవి - స్పృహకోల్పోయిన స్థితిలో ఆమె టబ్‌లో కుప్పకూలిపోయిఉంటే, ఖచ్చితంగా తలపై, శరీరంపై గాయాలు, మరకలు కనిపించాలి. మరి అవి ఉన్నాయా.?
6. బోనీకపూర్ పెళ్లయిన వెంటనే కూతురుని తీసుకుని ముంబయికి ఎందుకు వచ్చాడు? మళ్లీ ఒక్కరోజులోనే శ్రీదేవిని ఆశ్యర్యపరచడానికి ఎందుకు వెళ్లాడు?
7. మద్యం ఆనవాళ్లున్నాయన్నప్పుడు, ఎంత తాగితే, తనమీద తనకు నియంత్రణ కోల్పోయి టబ్‌లో పడిపోయిఉంటుంది? శ్రీదేవి కుటుంబ సన్నిహితుడు అమర్‌సింగ్, బిజెపి నేత సుబ్రమణ్యస్వామి చెప్పిందాని ప్రకారం, ఆమెకు మద్యం సేవించే అలవాటు లేదు. ఎప్పుడైనా కొద్దిమోతాదులో వైన్ గానీ, బీర్ గానీ సేవించేది. మరలాంటప్పుడు ఇదెలా సాధ్యం?

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని తరలించేందుకు ఇంకా ఆమె కుటుంబసభ్యులకు అనుమతి దక్కలేదు. దుబాయ్ పోలీసులకు ప్రాసిక్యూషన్ నుంచి ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. దీంతో శ్రీదేవి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రాసిక్యూటర్ లేఖ కోసం ఎదురుచూస్తున్నట్లు దుబాయ్ పోలీసులు చెప్పారు. మృతదేహం తరలింపు కేసులో న్యాయప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ ముందు శ్రీదేవి సంబంధీకులు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియన్ కాన్సులేట్‌కు చెందిన ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. కానీ వారెవరూ అప్‌డేట్ ఇచ్చేంందుకు అంగీకరించలేదు. ఏది ఏమైనా  శ్రీదేవి మృతి కేసు దర్యాప్తులో నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతుంది 

Related Posts