Highlights
- ఎట్టకేలకు శ్రీదేవి బాడీ అప్పగింత
- రేపు అంత్యక్రియలు
ఎన్నో అనుమానాలు, ఊహాగానాల నేపథ్యంలో ఎట్టకేలకు అందాల రాశి శ్రీదేవి భౌతుక కాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అంగీకరించారు.దుబాయ్ సీనియర్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. దుబాయ్‌లో అందరిలాగే శ్రీదేవి విషయంలో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇలాంటి దర్యాఫ్తు సహజమే అన్నారు. విచారణ అనంతరం నిజాలు తెలుస్తాయని చెప్పారు. కేసుకు సంబంధించి అందరినీ విచారిస్తామన్నారు.నటి శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసిందని, కానీ ఎందుకు ఏవేవో ఊహించుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారని, దుబాయ్ అధికారుల విచారణ పూర్తికాకుండానే భారత్‌కి చెందిన కొన్ని మీడియా వర్గాలు ఈ కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించాలని చూస్తున్నాయని దుబాయ్ పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అధికారులు నిజానిజాలు తెలుసుకుంటున్నారని, బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని, భారత్‌కు చెందిన మీడియాకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నామని, ఇలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టాలని దుబాయ్ పోలీసులు అన్నారు.
రేపు అంత్యక్రియలు
రేపు అంత్యక్రియలు శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ చేసిన అనంతరం భారత్‌కు అప్పగిస్తారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి భారత్ బయలుదేరుతారు. భారత్ వచ్చేందుకు నాలుగైదు గంటల సమయం పడుతుంది. బుధవారం అంత్యక్రియలు జరిగే అవకాశముంది.