యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీల నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చర్యలకు ఆదేశించింది. యూపీ సీఎం యోగి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఈసీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా యోగి ఆదిత్యనాథ్ పై మూడు రోజులు, మాయావతిపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. యోగి 72 గంటల పాటు, మాయావతి 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘అలి, భజరంగ్ బలి’ వ్యాఖ్యలను, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దంటూ ముస్లింలకు మాయావతి పిలుపు నివ్వడాన్ని ఈసీ తప్పుబట్టింది.