YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలకు నీటి గండం

తిరుమలకు నీటి గండం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నీటి గండం ముప్పు పొంచి ఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాలు వట్టిపోతున్నాయి. ఇక్కడున్న జలాశయాల్లోని నీరు మరో మూడు నెలలు మాత్రమే వినియోగానికి సరిపోనుంది. దీంతో జులైలోపు వర్షాలు కురవకపోతే భక్తకోటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ పరిస్థితి తీవ్రంగా పరిగణిస్తున్న టీటీడీ నీటి పొదుపునకు చర్యలు చేపట్టింది. నీటి పొదుపు చర్యల్లో భాగంగా స్థానికులు నివసించే బాలాజీనగర్‌కు ఐదు రోజులకోసారి మాత్రమే నీటిని వదులుతున్నారు. మఠాలు, హోటళ్లకు రోజుకు రెండు పూటలకు కలిపి ఎనిమిది గంటలే ఇస్తున్నారు. అద్దె గృహాలలో, తిరుమల పరిసరాల్లోని మరుగుదొడ్ల వద్ద తక్కువ నీటిని సరఫరా చేసే కుళాయిలను అమర్చుతున్నారు. 2018లో వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఇప్పటికే ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కుమారధార, పసుపుధార, పాపవినాశనం జలాశయాల్లో మాత్రమే నీరు అందుబాటులో ఉంది. ఇందులోని నీరు మూడు నాలుగు నెలల వరకే సర్దుబాటయ్యే పరిస్థితి ఉంది. తిరుమలలో ఉన్న 5 జలాశయాల్లో ప్రస్తుతం 3,840 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. తిరుమలలో అన్ని అవసరాలకు కలిపి రోజుకు 32 లక్షల గ్యాలన్లకుపైగా నీరు అవసరం ఉంటుంది.

Related Posts