Highlights
- ఇప్పుడు శ్రీదేవి...
- మార్చురి నుంచి ముంబైకి అందాలరాశి
దక్షిణ చలన చిత్రరంగంలో ఏం జరిగినా సంచలనమే. చివరికి నటీనటుల చావులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే..
దివ్యభారతి.. శ్రీదేవిలాగే 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మారింది. ఆమెలాగే మంచి అందగత్తె. అనతికాలంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపేసింది. కానీ 19 ఏళ్ల వయసులోనే మరణించింది. 1990లో వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. మూడేళ్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన బొబ్బిలి రాజాతోపాటు అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రంలాంటి సినిమాలన్నీ హిట్టే. హిందీలోనూ షోలా ఔర్ షబ్నమ్, దీవానా, విశ్వాత్మలాంటి హిట్ మూవీస్ ఉన్నాయి. తెలుగులో తొలిముద్దు సినిమా చేస్తున్నపుడే ఆమె చనిపోయింది. దీంతో ఈ మూవీలో కొంత భాగాన్ని అప్పట్లో ఆమెలాగే ఉండే రంభతో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్5న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. మద్యం మత్తులో బాల్కనీ నుంచి కింద పడిందని, ఎవరో తోసేశారని, ఆత్మహత్య చేసుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.
ఆమె ఎలా కింద పడిపోయిందన్నది మాత్రం తేలనేలేదు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ మాత్రం ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు స్పష్టంచేసింది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు 1996లో కేసును మూసేశారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా వాళ్లు తేల్చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీదేవి కూడా ఇలాంటి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మృతి చెందడం గమనార్హం. మేనల్లుడి పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన ఆమె.. అక్కడే మృతి చెందింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పారు. కానీ ఫోరెన్సిక్ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని తేల్చింది. రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మద్యం మత్తులో బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయినట్లు నివేదిక ఇచ్చారు.
శ్రీదేవి మృతి చెంది మూడు రోజులైంది. ఆమె పార్థీవదేహం ఇప్పటికి దుబాయ్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ మార్చురిలోనే ఉన్నది. శ్రీదేవి పార్థీవదేహం మార్చురికి తరలించి దాదాపు 36 గంటలు దాటింది. ఈ ఎపిసోడ్ కి ముందు ఆ 3 గంటల్లో ఏం జరిగిందన్న కోణంలో దుబాయ్ పోలీసులు రంధ్రాన్వేషణ చేసినట్టు సమాచారం,