యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్నూలు జిల్లాలో ఉర్దూ భాష శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సెక్రెటరీ మస్తాన్ వలి తెలిపారు. మంగళవారం ఉదయం కర్నూలు ప్రధాన కేంద్రం లోని మౌలానా ఆజాద్ ఉర్దూ అకాడమీ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ప్రప్రధమముగా రాయలసీమ జిల్లాలలో ఏప్రిల్ 22 నుండి మే 22 వరకు నెల రోజులలో ఉర్దూ భాషను ఉచితంగా నేర్పించుట కు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో ఉర్దూ డి ఐ ఓ పర్యవేక్షణలో ఏర్పాటు ఈ శిక్షణ కార్యక్రమం చేయబడినదని వెల్లడించారు. ముఖ్యంగా ఉర్దూ భాష పై అభిమానం నేర్చుకోవాలనే ఆసక్తి గల వారందరూ ఎలాంటి విద్యార్హతలు లేకున్నా వయస్సుతో నిమిత్తంలేకుండా 30 రోజులలో ఉర్దూ భాషను చదవడం వ్రాయడం మరియు మాట్లాడడం నేర్పుటకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చర్యలు తీసుకున్నదని తెలిపారు. అందులో భాగంగా ముందుగా రాయలసీమ జిల్లాలలో 77 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంఆధ్వర్యంలో ఉర్దూ భాష అభివృద్ధి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు పదిన్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు ఉర్దూ భాషలో నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వబడుతుందని డైరెక్టర్ మస్తాన్ వలి స్పష్టం చేశారు ఒక్కొక్క బ్యాచ్ కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్లకు 60 మందిని ఎంపిక చేసి ప్రాథమిక స్థాయి నుండి ఉర్దూ అక్షరమాల తో ఎంపిక కాబడిన అభ్యర్థులకు శిక్షణ కల్పిస్తామన్నారు. అందువల్ల ఉర్దూ భాష పై మక్కువ గల వారందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో 15 కేంద్రాలను ఏర్పాటు చేశామని కర్నూలు నగరంలో 3 కేంద్రాల్లో ఉచిత ఉర్దూ భాష శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు .ఇతర వివరాలకు మౌలానా ఆజాద్ ఉర్దూ అకాడమీ కర్నూలు కార్యాలయంలో సంప్రదించి వచ్చునని డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ టెండెంట్ జాఫర్,ఉర్దూ డిఐ ఓ సుబహాన్ తదితరులు పాల్గొన్నారు.