జిల్లాలోని భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని జిల్లా సంయుక్త పాలనాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధాభైనామాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ , భూ సేకరణ వంటి అంశాల పై జిల్లాలోని తహసిల్దార్లు, సంబంధిత అధికారులతో జేసి మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జేసి మాట్లాడుతూ గ్రామాలోని భూవివాదాలను పరిష్కరిస్తూ భూవివాదరహిత గ్రామాలుగా ప్రకటించే దిశగా అధికారులు కృషి చేయాలని జేసి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తహసిల్దార్ల వద్ద అర్హత ఉండి పెండింగ్ లో ఉన్న సాధాభైనామాలను వెంటనే పూర్తి చేయాలని, వివాదంగా వున్న సాధాభైనామా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు. మండలాలోని గ్రామాలో ఎక్కడ భూ సమస్యలు అధికంగా ఉన్నాయో గుర్తించి , తహసిల్దార్లు, ఆర్ఐ ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఎర్పాటు చేసి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. గ్రామాలోని వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదార్ పాస్ పుస్తకం లభిస్తుందని, ఇండ్ల స్థలాలకు, ఇతర భూములకు సంబంధించిన భూములకు పట్టాదార్ పాస్ పుస్తకం అందించడం జరగదని, రైతుల ఆధార్ కార్డు వివరాలు సేకరించిన అనంతరం మాత్రమే పట్టాదార్ పాస్ పుస్తకం అందించడం జరుగుతుందని , ఈ విషయం పై గ్రామాలో విస్తృత ప్రచారం కల్పించాలని జేసి ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న డిజిటల్ సంతకాలలో విచారణ పూర్తి చేసి నూతన పట్టాదార్ పాస్ ముద్రణకు సిద్దంగా వున్న పాస్ పుస్తకాల డిజిటల్ సంతకాల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జేసి తహసిల్దార్లకు సూచించారు. జిల్లాలో 1,82,953 భూ సంబంధిత ఖాతాలు ఉన్నాయని, వాటిలో 1,22,112 ఖాతాల డిజీటల్ సంతకాల ప్రక్రియ పూర్తయిందని, ప్రభుత్వ భూములు, ఆస్తులకు సంబంధించి 995 ఖాతాలను గుర్తించామని, 9843 ఖాతాలు పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు క్లియర్ గా ఉన్నాయని వీటికి సంబంధించిన ఆధార్ వివరాలను సేకరించి వెంటనే డిజిటల్ సంతకాల ప్రక్రియ పూర్తి చేయాల్సివుందని, జిల్లా వ్యాప్తంగా 39,469 ఖాతాలు క్లియర్ గా ఉన్నప్పటికి పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు క్లియర్ గా లేవని, పట్టాభూమిలో నల్లాలు ఉండడం, ప్రభుత్వ ఆస్తులు ఉండడం, ఇతర ప్రభుత్వరంగ సంస్థల వల్ల వీటి డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తి కాలేదని , జిల్లాలో 10,534 ఖాతాలు వివిధ కోర్టు కేసులు, ఇతర వివాదాలతొ పార్టీ బీ లో ఉన్నాయని, మొత్తం మీద 59,846 ఖాతాల డిజీటల్ సంతకాలు చేయాల్సి ఉందని, నిబంధనల మేరకు క్లియర్ గా ఉన్న పట్టాపాస్ పుస్తకాల డిజిటల్ సంతకాల ప్రక్రియ పూర్తి చేయాలని జేసి అధికారులను ఆదేశించారు. మొదటి దశ పట్టాపాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వివిధ పోరపాట్ల కారణంగా 10,773 పట్టాపాస్ పుస్తకాలను మళ్లీ ముద్రించామని, 10,314 నూతన పాస్ పుస్తకాల ముద్రణ సైతం జరిగిందని, వీటిలో 9722 మళ్లీ ముద్రించిన పట్టాపాస్ పుస్తకాలను, 8264 నూతన పట్టాపాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ముగిసిందని, మిగిలిన రికార్డులను సైతం ఆన్ లైన్లో అపడేట్ చేసి పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసి అధికారులను ఆదేశించారు . అనంతరం జేసి జిల్లాలో సింగరేణీ, కాళేశ్వరం ప్రాజేక్టు ,రైల్వే ప్రాజేక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరెంద గ్రామంలో 187 మంది వ్యక్తుల నుంచి సేకరించాల్సిన 186 ఎకరాల ప్రక్రియ జరుగుతుందని, 22 ఎకరాల భూమి వరకు ప్రభుత్వ భూమి సైతం సేకరించడం జరుగుతుందని, ప్రభుత్వ భూమి సేకరించే సమయంలో ఆ వివరాలను నోటిఫికేషన్లో క్లియర్ గా పేర్కోన్నాలని, సదరు ప్రభుత్వ భూములో ప్రైవేట్ వ్యక్తులు వారి అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదంటూ స్పష్టంగా పేర్కొన్నాలని జేసి అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజేక్టు, రైల్వే ప్రాజేక్టుకు పెండింగ్ లో ఉన్న భూ సేకరణ వివరాల జాబితా తయారు చేయాలని, ఆ భూమిని వెంటనే సేకరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసి తెలిపారు. భూ సేకరణకు సహకరిస్తూ కోర్టు వివాధాలకు వెళ్లకుండా భూమిని అందించేందుకు సిద్దంగా ఉన్న భూ యజమాన్యుల వివరాలు సేకరించి వారి వద్ద నుండి డిక్లరేషన్ స్వీకరించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అందాల్సిన అన్ని రకాల సాయం ప్రభుత్వం నుండి తప్పనిసరిగా వస్తుందని వారికి భద్రత కల్పించాలని, భూ యాజమాన్యులలో ఉండే అభద్రత భావాన్ని తొలగించి స్వచ్చందంగా భూమిని అప్పగించే దిశగా వారికి అవగాహన కల్పించాలని లేని పక్షంలో చట్టప్రకారం భూమలు సేకరించడానికి అవసరమైన ప్రణాళిక రుపోందించుకోవాలని తెలిపారు. పెద్దపల్లి ఆర్డివో ఉపెందర్ రెడ్డి, మంథని ఆర్డివో కె.నగేష్, జిల్లాలొని తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.