యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో పంచాయతీల వారీగా మే నెల 10లోగా ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. మే తొలివారంలో ఓటరు జాబితా సిద్ధం చేసి అభ్యంతరాలను స్వీకరిస్తారు. తరువాత పదో తేదిన తుది జాబితాను సిద్ధం చేస్తారు. తరువాత గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చే స్తారు.
జూన్ 18లోగా నోటిఫికేషన్ ?
పంచాయితీ ఎన్నికలు జూన్లో నిర్వహించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలనుంచి సమాచారం. మే నెల 10న తుది జాబితా ఖరారు చేసిన అనంతరం.. రిజర్వేషన్లు ఖరారుకు వారం రోజుల సమయం పడుతుంది. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ప్రభుత్వానికి , ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.. వీటి పరిశీలన తర్వాత మే నెలఖరుకు గాని జూన్ నెల తొలి వారంలోనైనా ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన 15 నుంచి 18 రోజుల్లో నామినేషన్లు దాఖలు, పరిశీలన, ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రకటించి, ఎన్నికలు నిర్వహిస్తారు..