యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత అమరావతి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా... తాజాగా వివిధ జిల్లాలకు హైకోర్టు జడ్జిలను కేటాయించారు. 13 జిల్లాలకు హైకోర్టు జడ్జిలను కేటాయిస్తూ ఉత్తర్వులు హైకోర్టు. జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన ఈ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. జిల్లాలకు కేటాయించిన జడ్జిల వివరాలు ఇలా ఉన్నాయి.
జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ (కృష్ణా జిల్లా), జస్టిస్ ఎస్వీ భట్ ( విశాఖపట్నం), జస్టిస్ ఏవీ శేషసాయి ( గుంటూరు), జస్టిస్ ఎం. సీతారామమూర్తి (తూర్పు గోదావరి), జస్టిస్ యూ. దుర్గప్రసాద్ రావు (చిత్తూరు), జస్టిస్ టి.సునీల్ చౌదరి (పశ్చిమ గోదావరి), జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి (కర్నూలు) జస్టిస్ జి. శ్యామ్ ప్రసాద్ ( అనంతపురం) జస్టిస్ జె. ఉమాదేవి ( నెల్లూరు), జస్టిస్ టి. రజని ( ప్రకాశం) జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు (కడప), జస్టిస్ కొంగర విజయ లక్ష్మి ( శ్రీకాకుళం), జస్టిస్ ఎం. గంగారావు ( విజయనగరం)